Saturday, December 18, 2010

శ్రీమంతుడు--1971











సంగీతం::T.V.చలపతిరావ్
రచన::దాశరధి
గానం::ఘంటసాల 

పల్లవి::


ఆహా ఏమందము..ఓహో ఈ చందము
నీ తీయని పెదవుల..తొణికే మధువులు నావే హ్హే..

ఆహా ఏమందము..ఓహో ఈ చందము
నీ తీయని పెదవుల తొణికే మధువులు నావే..ర్రా..

చరణం::1

చిన్నారి చిలకలెన్నో చేరాయి కోరి నన్ను..హహహా అయితేనేం
అందాల రామ చిలక..అలరించె నేడు నన్ను
ఈ బింకము ఈ పొంకము..ఈ బింకము ఈ పొంకము
ఏనాడు చూడ లేదే..ఏహేహే..                     
ఏమందము..ఓహోహో..ఈ చందము 
నీ తీయని పెదవుల తొణికే మధువులు నావే..హ్హ..

చరణం::2

నీ దారి చూచి చూచి..నిను కోరి వేచి వేచి 
నీ దారి చూచి చూచి..నిను కోరి వేచి వేచి
మనసేలనో చెలరేగెను..మనసేలనో చెలరేగెను
నే నిలువలేను రావే..హ్హాహ్హహ్హా..                     

ఏమందము..ఓహోహో..ఈ చందము 
నీ తీయని పెదవుల తొణికే మధువులు నావే..హ్హ.. 

చరణం::3

అరచాటు పైటలోన..అరమోడ్పు కనులలోన 
అరచాటు పైటలోన..అరమోడ్పు కనులలోన
ఆ వంపులు ఆ సొంపులు..ఆ వంపులు ఆ సొంపులు
నే తాళలేను రావే..ర్రా..

No comments: