Wednesday, December 29, 2010

కలెక్టర్ జానకి--1972--Abhinava kuchela.
























సంగీతం::V.కుమార్
రచన::C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,S.జానకి,P.సుశీల   

పల్లవి::

శ్రీమద్రరమారమణ గోవిందోహరి..  
ఆ ప్రకారంగా..దరిద్ర నారాయణ బిరుదాంకితుండు
జీర్ణవనిచ్చాలంకారకుండు..27 పుతాపుత్రిక పరివేష్టిత కుటీరుండు
బ్రహ్మ శ్రీ కుచేలుండు..హ్హా..తమకు తెలిసిన కథే..
ఒకానొక దివసంబున..వికలమానసుండై ఉండగా..అతని అర్ధాంగి
మిస్సెస్ వామాక్షీ కుచేల..ఏమని వైసు అడ్వైజు చేసిందయ్యా అంటే

చింతించకో ప్రాణనాధా..చింతించకో ప్రాణనాధా
నేదో చెప్పింది చేసిన..తీరును మన బాధ..చింతించకో ప్రాణనాధా 
సీటు కావాలన్నా..గోటు కావాలన్నా..సీటు కావాలన్నా..గోటు కావాలన్నా. 
సీటు కావాలన్నా..గోటు కావాలన్నా..వాటముగా..ఆ ఆ ఆ..

వాటముగా..బస్సురూటు కావాలన్నా..వాటముగా..బస్సురూటు కావాలన్నా 
పర్మిట్లు కావాలన్నా..ప్రమోషన్లు కావాలన్నా..పర్మిట్లు కావాలన్నా..ప్రమోషన్లు కావాలన్నా. 
ఎవ్వరో ఒక పెద్దవారిని ఆశ్రయించి..ఆదరణ పొందవలే..

చింతించకో ప్రాణనాధా...నాయనలారా శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కాలదు
సిఫ్హారస్సే లేకుంటే..చిన్న ఫైలైనా జరగదు..ఎస్క్యుజిమి..చిన్న పనైనా జరగదు
కాబట్టి..ద్వారకా నగరి దారి బట్టీ...నీ క్లాసుమేటు బాలకృష్ణున్ని..గోపాలకృష్ణుణ్ణి..
ఆబాల గోపాల కృష్ణుణ్ణి..ఇంటర్వ్యు సంపాదించి..మనదరిద్రం వదిలించమని ప్రార్థించవయ్యా..ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..ఒహొహో..వండ్రఫుల్‌రా శిష్య..ప్రార్థించవయ్యా అని తన సతీమణి చేత 
సలహాకృతుండై కుచేలుండు..ఎట్టకేలకు ద్వారకాపట్టణముకరిగి..తద్‌వైభవమ్మును గాంచి..  
తలతిరిగీ..సోడా..గురూ..థాంక్స్ రా శిష్యా..థాంక్స్..ఆ..ఎక్కడున్నాం?

తలతిరిగీ తద్‌వైభవమ్మును గాంచీ..అహా..తద్‌వైభవమ్మును గాంచీ..తలతిరిగీ
ఆహా..ఏమి శోభా..ఏమి శోభా..శోభా..యావండీ..పిలిచారా??...
ఉస్సో..రామాయణంలో పిడకలవేట..ఆ..తద్‌వైభవమ్మును గాంచీ..తలతిరిగీ

కృష్ణ పరమాత్ముని గని కరిగి పరవశించి..కుచేలుని గని..పరంధాముడేమన్నాడయ్యా అంటే  
వచ్చితివా బాల్య మిత్రమా..వచ్చితివా బాల్య మిత్రమా..ఏమి తెచ్చితివో నాకు చెప్పుమా
వచ్చితివా బాల్య మిత్రమా..ఏమి తెచ్చితివో నాకు చెప్పుమా..కాష్మీరు షాలువైన తేలేదా?
ఓహో..గాడ్రేజి బీరువైనా తేలేదా..కాష్మీరు షాలువైన తేలేదా?తేలేదా?

గాడ్రేజి బీరువైనా తేలేదా..ప్రజర్ కుక్కరు కొని రాలేదా..కుట్టుమిషనైనా మోసుకొతేలేదా..
దండైనా..యాపిల్ పండైనా..దండైనా యాపిల్ పండైనా..ఆంధ్రా ఫేమసు లడ్డైనా..
అంతో ఇంతో అర్పించనిదే..అహా..అంతో ఇంతో అర్పించనిదే..అనుకొన్న పని అసలే జరగదు
వచ్చితివా బాల్య మిత్రమా..ఏమి తెచ్చితివో నాకు చెప్పుమా..ఆ ఆ ఆ

ఆ పలుకులు విని సిగ్గుతో ముడుచుకొని పోయిన కుచేలుని వడలంటా తడిమీ
ఉత్తరీయపు కొంగున ఉన్న అటుకులు మూట పరికించీ..తఠాలున ఆరగించీ..
త్రుప్తిగా త్రేంచీ..బ్రేవ్..ఆ కృష్ణపరమాత్మ..పూరు హట్టుకు వెళ్ళి..గంపెడు పిల్లలను గాంచీ
దిగ్‌బ్రమచెందీ..ఏమన్నడయ్యా అంటే..కుచేలా ఇది నీ ఇల్లా..లేక మున్సిపల్ స్కులా..  
        
అయ్యయ్యో..అష్ట భార్యలున్న నాకే ఇందరు పిల్లలు లేరే..బాపురే నీ కెందుకయ్యా ఇందరు పిల్లలని
కృష్ణపరమాత్మ కుచేలునితో..చివరిసారిగా ఏమన్నాడంటే..ఆ..ఇద్దరులేక ముగ్గురు చాలని వినలేదా 
ఇందరు పిల్లలు కనడం నీకు మరియాదా..ఓహో..ఇద్దరులేక ముగ్గురు చాలని వినలేదా 
ఇందరు పిల్లలు కనడం నీకు మరియాదా

ఇప్పటికైనా తెలుసుకో..నీ తప్పును వెంటనే దిద్దుకో..ఓహోయ్..      
ఇప్పటికైనా తెలుసుకో..నీ తప్పును వెంటనే దిద్దుకో..ష్టాప్ ష్టాప్ ష్టాప్ ష్టాప్
అయ్యా..మృదంగ విధ్వనులు మీరుకూడ ష్టాపూ..ఈ ప్రకారంగా దివ్యవాణి ప్రభోదించగా
ఆకాశవాణి ఏమని శృతి కలిపిందంటే..ఎర్రత్రికోణం ఎర్రత్రికోణం ఎర్రత్రికోణం ఎర్రత్రికోణం 
శ్రీమద్రరమారమణ గోవిందోహరి.. 

No comments: