సంగీతం::P.ఆదినారాయణరావు
రచన::C.నారాయణరెడ్డి
గానం::P. సుశీల & Chorus
తారాగణం::కాంతారావు,జమున,శోభన్ బాబు,శారద,రాజనాల,రాజబాబు,మీనాకుమారి,హలం
త్రిమూర్తులను పసిపిల్లలను చేసిన అనసూయ వారి ఆకలిని తీరుస్తుంది.
నిద్ర పోయిన పసి పాపల ముగ్గురినీ మూడు ఊయలలో వేసి లాలి పుచ్చుతుంది.
త్రిమూర్తులు హాయిగా నిద్రపోతారు.
పరాభావించాలనుకున్న త్రిమాతలే తలలు వంచుకుని అనసూయ వద్దకు వచ్చి పతి భిక్ష కోరుకుంటారు.
తిరిగి పసిపాపలను త్రిమూర్తుల చేసి త్రిమాతలకు అప్పగిస్తుంది అనసూయ దేవి.
ఈ పరీక్షల వల్లనే లోకానికి పరమ పతివ్రత అయిన అనసూయ గాథ
లోకానికి విదితమయిందని సెలవిస్తారు త్రిమూర్తులు, అందరూ అనసూయ పాతివ్రత్య మహిమను కొనియాడతారు
దైవ మహిమ కంటెనూ పాతివ్రత్య మహిమ ఇంకా గొప్పదని శ్లాఘిస్తారు. ఇంతటితో కథ సుఖాంతమవుతుంది.
అనసూయ:
ఎన్ని జన్మల ఎన్ని నోముల
పుణ్యమో ఈనాడు కంటిని
జగములూపే ముగురు మూర్తులె
చంటి పాపలు కాగా! మా యింట వూయల లూగ!
బృందం: లాలీ... లాలీ... లాలీ... లాలీ...
అనసూయ:
ఎన్ని జన్మల ఎన్ని నోముల
పుణ్యమో ఈనాడు కంటిని
జగములూపే ముగురు మూర్తులె
చంటి పాపలు కాగా! మా యింట వూయల లూగ!
బృందం: లాలీ... లాలీ... లాలీ... లాలీ...
అనసూయ: నొసటి వ్రాతలు వ్రాసి వ్రాసి - విసిగినావో నిదురపో
బృందం: బ్రహ్మయ్య తాతా నిదురపో
అనసూయ: అసుర కోటుల దునిమి దునిమి - అలసినావో నిదురపో
బృందం: నారయ్య నాన్నా నిదురపో
అనసూయ: ప్రళయ తాండవమాడి ఆడీ - సోలసినావో నిదురపో
బృందం: శివయ్య బాబూ నిదురపో
అనసూయ:
ఎన్ని జన్మల ఎన్ని నోముల
పుణ్యమో ఈనాడు కంటిని
జగములూపే ముగురు మూర్తులె
చంటి పాపలు కాగా! మా యింట వూయల లూగ!
బృందం: లాలీ... లాలీ... లాలీ... లాలీ...
అనసూయ: లలిత కళలకు నిలయమైన - వాణియే నా కోడలాయే
బృందం: లాలీ జయ లాలీ
అనసూయ: లాలితముగా సిరుల నొసగే - లక్ష్మియే నా కోడలాయే
బృందం: లాలీ శుభ లాలీ
అనసూయ: పతిని కొలిచిన భాగ్యమేమో - పార్వతియే నా కోడలాయే
బృందం: లాలీ ప్రియ లాలీ
అనసూయ:
ఎన్ని జన్మల ఎన్ని నోముల
పుణ్యమో ఈనాడు కంటిని
జగములూపే ముగురు మూర్తులె
చంటి పాపలు కాగా! మా యింట వూయల లూగ!
బృందం: లాలీ... లాలీ... లాలీ... లాలీ... లాలీ... లాలీ...
అనసూయ:
ఎన్ని జన్మల ఎన్ని నోముల
పుణ్యమో ఈనాడు కంటిని
జగములూపే ముగురు మూర్తులె
చంటి పాపలు కాగా! మా యింట వూయల లూగ!
బృందం: లాలీ... లాలీ... లాలీ... లాలీ...
అనసూయ:
ఎన్ని జన్మల ఎన్ని నోముల
పుణ్యమో ఈనాడు కంటిని
జగములూపే ముగురు మూర్తులె
చంటి పాపలు కాగా! మా యింట వూయల లూగ!
బృందం: లాలీ... లాలీ... లాలీ... లాలీ...
అనసూయ: నొసటి వ్రాతలు వ్రాసి వ్రాసి - విసిగినావో నిదురపో
బృందం: బ్రహ్మయ్య తాతా నిదురపో
అనసూయ: అసుర కోటుల దునిమి దునిమి - అలసినావో నిదురపో
బృందం: నారయ్య నాన్నా నిదురపో
అనసూయ: ప్రళయ తాండవమాడి ఆడీ - సోలసినావో నిదురపో
బృందం: శివయ్య బాబూ నిదురపో
అనసూయ:
ఎన్ని జన్మల ఎన్ని నోముల
పుణ్యమో ఈనాడు కంటిని
జగములూపే ముగురు మూర్తులె
చంటి పాపలు కాగా! మా యింట వూయల లూగ!
బృందం: లాలీ... లాలీ... లాలీ... లాలీ...
అనసూయ: లలిత కళలకు నిలయమైన - వాణియే నా కోడలాయే
బృందం: లాలీ జయ లాలీ
అనసూయ: లాలితముగా సిరుల నొసగే - లక్ష్మియే నా కోడలాయే
బృందం: లాలీ శుభ లాలీ
అనసూయ: పతిని కొలిచిన భాగ్యమేమో - పార్వతియే నా కోడలాయే
బృందం: లాలీ ప్రియ లాలీ
అనసూయ:
ఎన్ని జన్మల ఎన్ని నోముల
పుణ్యమో ఈనాడు కంటిని
జగములూపే ముగురు మూర్తులె
చంటి పాపలు కాగా! మా యింట వూయల లూగ!
బృందం: లాలీ... లాలీ... లాలీ... లాలీ... లాలీ... లాలీ...
No comments:
Post a Comment