Tuesday, December 21, 2010

మూగ మనసులు--1964



సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::జమునారాణి

పల్లవి::

ఓహో.......
హూ..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
ముక్కుమీద కోపం..నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం..నీ ముందరి కాళ్ళ బంధం

చరణం::1

అడపదడప ఇద్దరు అలిగేతేనే అందం
అడపదడప ఇద్దరు అలిగేతేనే అందం
అలకతీరి కలిసేదే అందమైన బంధం
అలకతీరి కలిసేదే అందమైన బంధం

ఆ..ముక్కుమీద కోపం..నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం..నీ ముందరి కాళ్ళ బంధం

చరణం::2

సిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం
సిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం
ఆ బుగ్గమీద సిటికేసి దగ్గరొస్తె బంధం

హోయ్..ముక్కుమీద కోపం..నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం..నీ ముందరి కాళ్ళ బంధం

చరణం::3

ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం
ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం
ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళె బంధం
ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళె బంధం

మ్మ్హు మ్మ్హు మ్మ్హు..
ముక్కుమీద కోపం..నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం..నీ ముందరి కాళ్ళ బంధం

చరణం::4

తల్లీగోదారికీ..ఎల్లువొస్తె అందం
తల్లీగోదారికీ..ఎల్లువొస్తె అందం
ఎల్లువంటి బుల్లోడికి..పిల్ల గౌరి బంధం
ఎల్లువంటి బుల్లోడికి..పిల్ల గౌరి బంధం

డుర్ర్ర్... 
ముక్కుమీద కోపం..నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం..నీ ముందరి కాళ్ళ బంధం
హోయ్..ముక్కుమీద కోపం..నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం..నీ ముందరి కాళ్ళ బంధం
ఓహో....ఓహో....హోయ్...హోయ్.. 

No comments: