Saturday, December 18, 2010

రోజులు మారాయి--1955








సంగీతం::మాస్టర్ వేణు
రచన::తాపీ ధర్మారావు
గానం::ఘంటసాల, జిక్కి

పల్లవి::

ఇదియే హాయి..కలుపుము చేయి..
వేయి మాటలేలనింక..వేయి మాటలేలనింక..ఓఓఓ 
ఇదియే హాయి..కలుపుము చేయి..

ఇదియే హాయి..కలుపుము చేయి..
వేయి మాటలేలనింక..వేయి మాటలేలనింక..ఓఓఓ 
ఇదియే హాయి..కలుపుము చేయి..

చరణం::1

ఓఓఓఓ ఆ చూపులోనే కురియును తేనె 
చిరునగవాహా వెలుగున వాలి
మనసుకు హాయి సోలునే..ఓఓఓ..  
మనసుకు హాయి సోలునే....... 
నీవాడిన మాట..సాటిలేని పూలబాట
సాటిలేని పూలబాట..ఓఓఓఓఓఓ..
ఇదియే హాయి..కలుపుము చేయి..

చరణం::2

అందాలలోన నడివడిలోన
తొలుతను నీవే తెలియగరావే
బ్రతుకున మేలు చూపవే..ఓఓఓఓ..
బ్రతుకున మేలు చూపవే........
నీ చూపే చాలు అదే నాకు వేనవేలు
అదే నాకు వేనవేలు..ఓఓఓఓ..
ఇదియే హాయి..కలుపుము చేయి..

చరణం::3

ఈ లోకమేమో మరో లోకమేమో
మనసులతోనే తనువులు తేలే
బ్రతుకిక తూగుటూయలే..ఓఓఓ
బ్రతుకిక తూగుటూయలే.....
ఈనాటి ప్రేమ..లోటులేని మేటి సీమ
లోటులేని..మేటి సీమ..ఓఓఓఓఓ 

ఇదియే హాయి..కలుపుము చేయి..
వేయి మాటలేలనింక..వేయి మాటలేలనింక..ఓఓఓ 
ఇదియే హాయి..కలుపుము చేయి..

No comments: