సంగీతం::K.V.మహదేవన్
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,సావిత్రి,గుమ్మడి,నాగభూషణం,జమున,పద్మనాభం,అల్లు రామలింగయ్య.
పల్లవి::
ఓహో హో హో..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓహొహూ ఓ ఓ ఓ
గోదారి గట్టుంది..గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది..పిట్ట మనసులొ ఏముంది
ఓ ఓ ఓ ఓ హోయ్
గోదారి గట్టుంది..గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది..పిట్ట మనసులొ ఏముంది
ఓ ఓ ఓ ఓ ఓ ఓ హోయ్...
చరణం::1
వగరు వగరుగ పొగరుంది..పొగరుకు తగ్గ బిగువుంది
వగరు వగరుగ పొగరుంది..పొగరుకు తగ్గ బిగువుంది
తీయ తీయగ సొగసుంది..సొగసుని మించె మంచుంది
తీయ తీయగ సొగసుంది..సొగసుని మించె మంచుంది..
ఈ ఈ ఈ ఈ ఈ ఈ
గోదారి గట్టుంది..గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది..పిట్ట మనసులొ ఏముంది
ఓ ఓ ఓ ఓ ఓ ఓ హోయ్....
చరణం::2
ఎన్నెల వుంది..ఎండ వుంది..పూవు వుంది..ముల్లుంది
ఎన్నెల వుంది..ఎండ వుంది..పూవు వుంది..ముల్లుంది
ఏది ఎవ్వరికి ఇవ్వాలో..ఇడమరిసే ఆ ఇది వుంది....
గోదారి గట్టుంది..గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది..పిట్ట మనసులొ ఏముంది
ఓ ఓ ఓ ఓ ఓ ఓ హోయ్...
చరణం::3
పిట్ట మనసు పిసరంతైనా..పెపంచమంతా దాగుంది
పిట్ట మనసు పిసరంతైనా..పెపంచమంతా దాగుంది
అంతు దొరకని నిండు గుండెలో..ఎంత తోడితే అంతుంది
అంతు దొరకని నిండు గుండెలో..ఎంత తోడితే అంతుంది
ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ
గోదారి గట్టుంది..గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది..పిట్ట మనసులొ ఏముంది
ఓ ఓ ఓ ఓ ఓ ఓ హోయ్...
No comments:
Post a Comment