Wednesday, December 29, 2010

ప్రేమ మందిరం--1981




సంగీతం::K.V. మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు, P.సుశీల
తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్ పల్లవి::

ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం
ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం

నిరుపేదలు తలదాచుకునే..నింగి కుటీరం
కలవారలు కలలుకనే..పసిడి పంజరం
నిరుపేదలు తలదాచుకునే..నింగి కుటీరం
కలవారలు కలలుకనే..పసిడి పంజరం
ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం 
ఊ..ఊ..ఊ..

చరణం::1

ఎనిమిది దిక్కుల నడుమ సంసారం
ఎనభై నాలుగు లక్షల సంతానం
ఎనిమిది దిక్కుల నడుమ సంసారం
ఎనభై నాలుగు లక్షల సంతానం

సప్తస్వర సంగీతం..నవరసాల సాహిత్యం
రంగరించుకున్నదీ రంగుల వలయం

రిసరిగ గసగమ సగమదనిస
నిదపమగరిసనిద

సప్త స్వర సంగీతం..నవరసాల సాహిత్యం
రంగరించుకున్నదీ రంగుల వలయం
మనసంఘమ నిలయం..నవసాగర మధనం..ఇది శాశ్వత ప్రణయం
సుందరం..సుమధురం..ప్రేమ మందిరం

నిరుపేదలు తలదాచుకొనే నింగి కుటీరం
కలవారలు కలలు కనే పసిడి పంజరం
ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం

చరణం::2

నీలో విన్నా వలపుల ఓంకారం
నీలో కన్నా వెలుగుల ఆకారం
నీలో విన్నా వలపుల ఓంకారం
నీలో కన్నా వెలుగుల ఆకారం

ఉదయారుణ మందారం..హృదయేశ్వరి సింధూరం
కౌగిలిగా మెరిసిన..కళ్యాణ మంటపం
రిసరిగ గరిదప దపదప దపదస
ఉదయారుణ మందారం..హృదయేశ్వరి సింధూరం
కౌగిలిగా మెరిసిన..కళ్యాణ మంటపం

ఇది సృష్టికి ప్రాణం..మన ముక్తికి మూలం
ఇది ఇలలో స్వర్గం..
సుందరం..సుమధురం..ప్రేమ మందిరం

నిరుపేదలు తల దాచుకొనే నింగి కుటీరం
కలవారలు కలలు కనే పసిడి పంజరం
ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం

No comments: