సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::N.T.రామారావు,ప్రభాకర రెడ్డి,జగ్గయ్య,కాంతారావు,వాణిశ్రీ,నిర్మల
పల్లవి::
ఆమె::కసిగావుంది కసికసిగావుంది
కలవక కలవక కలిసినందుకు కస్సుమంటుంది
కసుక్కుమంటూ కాటేయ్ మంటుంది
అతడు::కసిగావుంది కసికసిగావుంది
కలవక కలవక కలిసినందుకు కస్సుమంటుంది
కసకస నిన్నూ నవిలేయ్ మంటుంది
కసిగావుంది..ఆహా..కసికసిగావుంది
చరణం::1
ఆమె::నీ ఛాతీ చూస్తే నిన్నరాతిరి గుర్తుకు వస్తూంది
అబ్బా..
నీ కండలు చూస్తే గుండెనిండా గుబులే పుడుతూంది
నీ ఛాతీ చూస్తే నిన్నరాతిరి గుర్తుకు వస్తూంది
అహ్హాహా..
నీ కండలు చూస్తే గుండెనిండా గుబులే పుడుతూంది
అతడు::గుబులంతా నీ కళ్లల్లోనే గుబగుబమంటూంది
లలలలా..
గుబులంతా నీ కళ్లల్లోనే గుబగుబమంటూంది
ఓహో..
అది కొత్త కొత్త కథలను రోజూ చెప్పక చెపుతూంది
కసిగావుంది..ఆహా హా..కసికసిగావుంది
కలవక కలవక కలిసినందుకు కస్సుమంటుంది
కసుక్కుమంటూ కాటేయ్ మంటుంది..ఈ..
కసిగావుంది..ఆ..కసికసిగావుంది..ఈ..
చరణం::2
ఆమె::ఎంతకాలం నీకోసం ఎదురుచూస్తూ ఉండేది
ఎదురు తిరిగే పరువాన్ని అదుపులోన ఉంచేది
ఎంతకాలం నీకోసం ఎదురుచూస్తూ ఉండేది
ఎదురు తిరిగే పరువాన్ని అదుపులోన ఉంచేది
అతడు::అదుపులోన ఉండనిదాన్ని అనుభవించాలి
ఆ..అదుపులోన ఉండనిదాన్ని అనుభవించాలి
అనుభవానికి రానిదాన్ని వదులుకోవాలి
కసిగావుంది..ఆహా హా..కసికసిగావుంది
కలవక కలవక కలిసినందుకు కస్సుమంటుంది
కసకస నిన్నూ నవిలేయ్ మంటుంది
కసిగావుంది..కసికసిగావుంది
చరణం::3
ఆమె::నీ అండలేక అందరికీ నే నలుసైపోయాను
నువ్వుండగా ఏ మొనగాడు నా జోలికి రాలేడు
నీ అండలేక అందరికీ నే నలుసైపోయాను
నువ్వుండగా ఏ మొనగాడు నా జోలికి రాలేడు
అతడు::అందుకేగా ఆడదానికో మగవాడుండాలి
అందుకేగా ఆడదానికో మగవాడుండాలి
ఉంటే చాలదు అందుకు తగ్గ మగసిరి వుండాలి
కసిగావుంది..ఓహోహోహో..కసికసిగావుంది
కలవక కలవక కలిసినందుకు కస్సుమంటుంది
కసుక్కుమంటూ కాటేయ్ మంటుంది..ఈ..
కసిగావుంది..హ్హా..కసికసిగావుంది
హో..కసిగ ఉందీ..ఆహా..కసికసిగా ఉందీ
No comments:
Post a Comment