Friday, January 18, 2008

శారద--1973

























సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::చక్రవర్తి,రామారావు బృందం


రా, రారా, రా, రా, రా, రా...
అటో..ఇటో తేలిపోవాలి..అటో ఇటో తేలి పోవాలి
ఇటో..అటో తేలిపోవాలి..అటో ఇటో తేలి పోవాలి

ఏకులాగ వచ్చావ్..నువు
మేకులాగ మారావ్..హటో దూర్‌ హటో
గెటవుట్‌...

అటో ఇటో..అటో ఇటో తేలి పోవాలి

నీ ముక్కు పిండేస్తాం..నీడొక్కచింపేస్తాం
నీ కళ్లు పీకేస్తాం..నీ కాళ్లు నరికేస్తాం
ముక్కు పిండేస్తాం, డొక్క చింపేస్తాం, కళ్లు పీకేస్తాం...
కాళ్లు నరికేస్తాం...

అటో ఇటో తేలి పోవాలి..అటో ఇటో తేలి పోవాలి

అటో ఇటో తేలిపోతుంది..
ఇక అమీ తుమీ తెలిసి పోతుంది
అద్దెకు తెచ్చిన గాడిదలు గుర్రాలౌతాయా
బాడుగకొచ్చిన బడుద్దాయిలు భరతం పడతారా!
నా భరతం పడతారా!
కొమ్ములూడ గొడతాను..కోరలు పీకేస్తాను
దమ్ములుంటె రమ్మను దుమ్ము రేగ కొడతాను
తా..తంతా..తంతా కలిపి తంతా...
తండ్రిని మించిన దైవం లేడను దేశంరా మనది

తండ్రిం శరణం గచ్ఛామి..తండ్రిం శరణం గచ్ఛామి!
మొగుడే భార్యకు పరమేశ్వరుడను దేశం గద మనది
మొగుడుం శురణ గచ్ఛామి..మొగుడుం శరణం గచ్ఛామి
ఇంటిల్లిపాది ఇంపుగ వుండే సంఘంరా మనది
కలసీ, మెలసీ కమ్మగ బతికిన ఇంటికి సాటేది..
మన ఇంటికి సాటేదీ ...
అటో ఇటో తేల్చి పారేశావ్‌ ...
ఆరని వెలుగు ఇంట్లో నిలపావు..నా రాజా
ఇల్లు నిలిపావు..నా ఇల్లు నిలిపావు ...

No comments: