Monday, January 14, 2008

చెల్లెలి కాపురం--1971

సంగీతం::K.V..మహాదేవన్
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::S.జానకి
తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ,మణిమాల,నాగభూషణం,ఛాయాదేవి,నిర్మల,K.V.చలం.
అల్లు రామలింగయ్య   

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
బలె బలే మా..అన్నయ్యా బంగారం లాంటన్నయ్య 
హోయ్..బలె బలే మా అన్నయ్యా బంగారం లాంటన్నయ్య 
ఇలాంటి వాడు లోకంలో..నూటికి కోటికి ఒకడయ్యా
ఇలాంటి వాడు లోకంలో..నూటికి కోటికి ఒకడయ్యా
హోయ్..బలె బలే మా అన్నయ్యా - బంగారం లాంటన్నయ్య 

చరణం::1

చల్లని వార్త పంపాడూ..కొల్లగ ఆశలు పెంచాడూ
చల్లని వార్త పంపాడూ..కొల్లగ ఆశలు పెంచాడూ
చీకటి పాలౌ చెల్లి బ్రతుకున..వేయి దీపములు వెలిగించాడూ
బలె బలే మా అన్నయ్యా..బంగారం లాంటన్నయ్య 
హోయ్..బలె బలే మా అన్నయ్యా బంగారం లాంటన్నయ్య 

చరణం::2

ఎన్నెన్నో పుస్తకాలు రాస్తాడూ..ఎంతెంతో పేరు తెచ్చుకుంటాడూ
ఎన్నెన్నో పుస్తకాలు రాస్తాడూ..ఎంతెంతో పేరు తెచ్చుకుంటాడూ
మెడ నిండా దండలతో..మేళ తాళాలతో
మెడ నిండా దండలతో..మేళ తాళాలతో
ఊరూర అన్నయ్యా ఊరేగుతూ వస్తాడూ..ఆ ఆ  
బలె బలే మా అన్నయ్యా..బంగారం లాంటన్నయ్య 
ఇలాంటి వాడు లోకంలో..నూటికి కోటికి ఒకడయ్యా
హోయ్..బలె బలే మా అన్నయ్యా బంగారం లాంటన్నయ్య

No comments: