Friday, January 18, 2008

శారద--1973

సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి

దర్శకత్వం::K.విశ్వనాధ్
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

శోభన్:: కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి
శారద:: ఆ వధువు వలపే విరిసేది ఈనాడే తొలిసారి
శోభన్:: అందుకే అందుకే తొలిరేయి..అంతహాయి అంతహాయి అంతహాయి

చరణం::1

శోభన్:: వెన్నెల కాచే మోమునుదాచి..చీకటి చేసేవు ఎందుకని?
శోభన్:: వెన్నెల కాచే మోమునుదాచి..చీకటి చేసేవు ఎందుకని?

శారద:: ఇంతటి సూర్యుడు ఎదుట నిలువగా..ఈ మోము జాబిలి దేనికని?

శోభన్:: అల్లరి చూపులతోనే నను..అల్లుకు పోయే వెందుకని?
శోభన్:: అల్లరి చూపులతోనే నను..అల్లుకు పోయే వెందుకని?

శారద:: ఆ..అల్లికలోనే తీయని విడదీయని బంధం వున్నదని..

శోభన్:: అందుకే అందుకే తొలిరేయి..అంతహాయి అంతహాయి అంతహాయి

చరణం::2

శోభన్::నీ పెదవీ కనగానే..నా పెదవీ పులకించింది ఎందుకని?
శోభన్::నీ పెదవీ కనగానే..నా పెదవీ పులకించింది ఎందుకని?

శారద:: విడి విడిగా వుండలేక..విడి విడిగా వుండలేక..
పెదవులు రెండూ...అందుకని

శోభన్:: ఎదురు చూసే పూలపానుపు ఓపలేక..ఉసురుసురన్నది ఎందుకని?
ఇద్దరినీ తన కౌగిలిలో..ముద్దు ముద్దుగా...అందుకని

శారద:: అందుకే అందుకే తొలి రేయి..అంత హాయి..అంత హాయి!
ఇద్దరు: అంత హాయి..అంత హాయి..అంత హాయి..అంత హాయి!

No comments: