సంగీతం!!చక్రవర్తి
రచన::దాశరథి
గానం::V.రామకృష్ణ ,P.సుశీల
రాగం::యదుకుల కాంభోజిపహడి(లేక) హిందుస్తానీ
పహడిలో తరుచు ప్రతిధ్వని వుంటుంది
చందమామ రావే జాబిల్లి రావే
అమ్మాయి అలిగింది అలకతీర్చిపోవే
అలకతీర్చిపోవే
చందమామ రావే జాబిల్లి రావే
అబ్బాయి నోటికి తాళమేసి పోవే
తాళమేసి పోవే
చందమామ రావే...
చల్లగాలి జడిపిస్తోంది ఎలాగా...
గళ్ళదుప్పటి కప్పుకొండి ఇలాగా
పండువెన్నెల రమ్మంటుంది ఎలాగా
తలుపుతీసా వెళ్ళిరండి ఇలాగా
అందాల ఈరేయి వెళతాను అంటొంది
ఇద్దరిని ఒక్కటిగ చూడాలని అంటుంది
ఏదో వంకతో ఎందుకు పిలవాలీ
కావాలంటే సూటిగానే అడగలేరా
చందమామ రావే జాబిల్లి రావే
అబ్బాయి నోటికి తాళమేసి పోవే
తాళమేసి పోవే
చందమామ రావే...
అమ్మాయి పుడితేను ఎలాగా
పెళ్ళిచేసి పంపాలి ఇలాగా
అబ్బాయి పుడితేను ఎలాగా
గొప్పవాణ్ణి చేయాలి ఇలాగా
అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా
మీలాగే వుండాలి మీ మనసే రావాలి
తల్లే పాలతో మంచిని పోయాలి
ఆ మంచితోనే�ోనే వారు మనకు పేరు తేవాలి
చందమామ రావే జాబిల్లి రావే
పాపాయి పుడితేను జోలపాడ రావే
జోలపాడ రావే
చందమామ రావే....
No comments:
Post a Comment