సంగీతం::చక్రవర్తి
రచన::దేవులపల్లి కౄష్ణశాస్త్రి
గానం::S.P.బాలు,P.సుశీల
శంకరాభరణ::రాగం
కుశలమా నీకు కుశలమేనా
మనసు నిలుపుకోలేకా
మరి మరి అడిగాను
అంతే అంతే అంతే
కుశలమా నీకు కుశలమేనా
ఇన్నినాళ్ళు వదలలేకా
ఎదో ఎదో వ్రాసాను అంతే అంతే అంతే
!! కుశలమా !!చిన్నతల్లి ఏమందీ
నాన్న ముద్దు కావాలంది
పాలు గారు చెక్కిలిపైన
పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవుల పైన
దేవిగారికొకటి
ఒకటేనా.....ఒకటేనా
హహ...ఎన్నైనా....ఆ...
హాయ్ ఎన్నెన్నో......
మనసు నిలుపుకోలేక మరి మరి
అడిగాను అంతే అంతే అంతే
!! కుశలమా .. హాయ్ !!పెరటిలోని పూల పానుపు
త్వర త్వరగా రమ్మంది
పొగడ నీడ పొదరిల్లు
దిగులు దిగులుగా ఉంది
ఎన్ని కబురులొచ్చేనో
ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కల పైన
నీలి మబ్బు పాయలపైనా
అందేనా ఒకటైనా
అందెనులే తొందర తెలిసెనులే
!! కుశలమా !!
No comments:
Post a Comment