Thursday, January 31, 2008

చక్రవాకం--1974



సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల

వెళ్ళిపో వెళ్ళిపో
వెళ్ళాలంటే వెళ్ళిపో
ఓ కుళ్ళుమోమొతు పిల్లగా
మళ్ళివచ్చేదాకా
నీ కళు కాస్తా ఇచ్చిపో
నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో
ఉండిపో ఉండిపో వుండాలంటే వుండిపో
ఓ ఒళ్ళుపొగరుపిల్లా...
వెళ్ళలేని కళ్ళల్లో
నువ్వు వెన్నెలల్లే ఉండిపో....
నువ్వు వెన్నెలల్లే ఉండిపో....

వెన్నెలతో నన్ను పోల్చకూ
అది సగం రోజులుంటుందీ నెలకు
వెన్నెలతో నన్ను పోల్చకూ
అది సగం రోజులుంటుందీ నెలకు
ఆ మిగితాసగం నేనుంటానులే
ఒద్దికంటే ఇద్దరం పంచుకోవాలిలే
ఉండిపో ఉండిపో ఉండాలంటే ఉండిపో
ఓకుళ్ళుమొతు పిల్లగా
మల్లి వచ్చే దాకా
నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో...
నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో...


పోతే పో...నాకే అన్నావుగా
మరి బుంగమూతి పెట్టుకు
కూర్చోన్నావేంటి మరి
నీకే నువు టవునుకెలతావు
స్నేహితులని..సినిమాలకనీ...
పగలంతా హాయిగాతిరిగి
రాత్రికి మత్తుగా నిద్రపోతావు..
నే నొంటరిగా ఎలావుండనూ...

మగాడివి నీకేమి
పగలంతా తిరుగుతావు
మాపటికి అలసిపోయి
మత్తుగా నిదరోతావ్
ఆ...హా...ఆ...ఆ...
మగాడివి నీకేమి
పగలంతా తిరుగుతావు
మాపటికి అలసిపోయి
మత్తుగా నిదరోతావ్
ఆడపిల్లవు నీకేమి
అద్దమెదుట కూర్చోంటావ్
ఆడపిల్లవు నీకేమి
అద్దమెదుట కూర్చోంటావ్
రోజు రోజుకో కొత్త పోంగు
చూసుకొంటూ..గడిపేస్తావ్
సరే వెళ్ళో వెళ్ళిపో
వెళ్ళాలంటే వెళ్ళిపో
ఓ ఒల్లుపొగరుపిల్లా
వెళ్ళలేని కళ్ళల్లోనువు
వెన్నెలల్లే ఉండిపో
నువు వెన్నెలల్లే ఉండిపో...

నీ జతలో నేనే మగాడినీ
నువు లేకుంటే నాకు
నేనే పగాడిని
నీ జతలో నేనే మగాడినీ
నువు లేకుంటే నాకు
నేనే పగాడిని
పగవాడితో పోరు
తెలిసినట్లూంటుంది
పడుచువాడితో పొత్తు
ప్రాణాలు తీస్తాది
ఐతే...ఉండిపో ఉండిపో
ఉండాలంటే వుండిపో
సరే... వెళ్ళిపో వెళ్ళిపో
వెళ్ళాలంటే వెళ్ళిపో
ఓ ఒల్లుపొగరు పిల్లా
వెళ్ళలేని కళ్ళల్లో
ఓ కుళ్ళుమొతు పిల్లగా
మల్లివచ్చేదాకా
నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో
నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో.....

No comments: