సంగీతం::సత్యం
రచన::దేవులపల్లి కౄష్ణశాస్త్రి
గానం::P.సుశీల,S.జానకి
రాగం:::కాఫీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం కర్పూరదీపం
ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం
ఇదే సుమా నా కుంకుమతిలకం
ఇదే సుమా నా మంగళసూత్రం
ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం
ఇంటిలోన నా పాపరూపునా గోరంతదీపం
కంటికెదురుగా కనబడువేళలా కొండంతదీపం
నా మనస్సులో వెలిగేదీపం
నామనుగడ నడిపే దీపం
ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం
ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో
ఈకోనేట ఈ చిరుదివ్వ్యల చూసి చుక్కలనుకొంటారు
ఏవైనా ఏదైనా కోవెలలో కొలువైవుండే దేవికిపట్టే హారతులే
ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం
చేరనీ నీపాద పీఠం నా ప్రాణదీపం
నోచిన నోముల పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
నోచిన నోముల పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
ఎటనైనా ఎపుడైనా నే పలికే కళ్యాణదీపం
నే వలచే నా ప్రాణదీపం
ఆరనీకుమా ఈదీపం కార్తీకదీపం
చేరనీ నీపాదపీఠం
కర్పూరదీపం
No comments:
Post a Comment