సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల
బృందం:: రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా
నందకిషోరా..నవనీత చోరా
బృందావన సంచార
బృందం:: రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ గుడిలో గంటలు మోగినవి..నా గుండెల మంటలు రేగినవి
నీ గుడిలో గంటలు మోగినవి..నా గుండెల మంటలు రేగినవి
ఇన్నాళ్లు చేశాను ఆరాధనా..ఇన్నాళ్లు చేశాను ఆరాధనా
దాని ఫలితమా నాకీ ఆవేదనా
బృందం:: రాధాలోలా..గోపాలా..
గాన విలోలా యదుబాలా
శారద: :నందకిషోరా..నవనీత చోరా
బృందావన సంచార
బృందం:: రాధాలోలా..గోపాలా..
గాన విలోలా యదుబాలా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మనిషిని చేసి..మనసెందుకిచ్చావు?
ఆ మనసును కోసే..మమత లెందుకు పెంచావు?
బృందం::ఆ ఆ ఆ....
మనిషిని చేసి..మనసెందుకిచ్చావు?
ఆ మనసును కోసే..మమత లెందుకు పెంచావు?
మనసులు పెనవేసి..మమతలు ముడివేసి
మగువకు పతి మనసే..కోవెలగా చేసి
ఆ కోవెల తలుపులు మూశావా?...
బృందం:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ కోవెల తలుపులు మూశావా?...
నువు..హాయిగ..కులుకుతు చూస్తున్నావా?
బృందం:: ఆ ఆ ఆ ఆ..
నీ గుడిలో గంటలు మోగినవి..నా గుండెల మంటలు రేగినవి
చరణం::2
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ గుడిలో గంటలు మోగాలంటే..
నీ మెడలో మాలలు నిలవాలంటే..
నీ సన్నిధి దీపం వెలగాలంటే..
నే నమ్మిన దైవం నీవే అయితే..
నా గుండెల మంటలు ఆర్పాలి..
నా స్వామి చెంతకు చేర్చాలి..
బృందం:: రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా
రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా
రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా
గోపాలా..గోపాలా..గోపాలా
No comments:
Post a Comment