సంగీతం :: చక్రవర్తి
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల
రాగం::చారుకేశి
హిందుస్తానీ కర్నాటక !
వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ
వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ
వనమెల్ల వేచేనురా
నీరాక కోసం నిలువెల్ల కనులైనీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా
కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని
గున్న మావి పూయనన్నదీ నీవు రావని
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కదలాడే యమునా నదినీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా !!
మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని
నా నీడ తానన్నదీ రాడు రాడేమని
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రావేల చిరుజల్లుగానీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా !!
No comments:
Post a Comment