Saturday, January 05, 2008

కార్తీక దీపం--1979::కానడ::రాగం




సంగీతం:: సత్యం
రచన::M.గోపి

గానం::S.జానకి,S.P.బాలు.

కానడ::రాగం

(హిందుస్తానీ ~ కర్నాటక)

పల్లవి::

నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందనీ

నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందనీ

నీ కౌగిలిలో తల దాచి...

చరణం::1

చల్లగ కాసే పాల వెన్నెల
నా మనసేదో వివరించు
అల్లరి చేసే ఓ చిరుగాలి
నా కోరికలే వినిపించు
నా కోవెలలో స్వామివి నీవై
వలపే దివ్వెగ వెలిగించు

నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందనీ

నీ కౌగిలిలో తల దాచి..

చరణం::2

నింగి సాక్షి..నేల సాక్షి
నిను వలచిన నా మనసే సాక్షి
మనసులోన మనుగడలోన 
నాలో నీవే సగపాలు
వేడుకలోను..వేదనలోను
పాలు తేనెగ ఉందాము

నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందనీ

నీ కౌగిలిలో తల దాచి..

2 comments:

Anonymous said...

any updates coming ?

Anonymous said...

я думаю: спасибо... а82ч