సంగీతం::C.R.సుబ్బరామన్ రచన::సముద్రాల సీనియర్ గానం::K.రాణి నిర్మాత::చక్రపాణి దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య సంస్థ::వినొదా పిక్చర్స్ నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,s.v.రంగారావు. పల్లవి:: అంతా భ్రాంతియేనా..జీవితానా వెలుగింతేనా ఆశా నిరాశేనా..మిగిలేది చింతేనా..ఆఆ అంతా భ్రాంతియేనా..జీవితానా వెలుగింతేనా ఆశా నిరాశేనా..మిగిలేది చింతేనా.. చరణం::1 చిలిపితనాల..చెలిమే మరచితివో..ఓ ఓ ఓ ఓ చిలిపితనాల..చెలిమే మరచితివో..ఓ ఓ ఓ ఓ తలిదండ్రుల మాటే..దాట వెరచితివో..ఓ ఓ ఓ ఓ తలిదండ్రుల మాటే..దాట వెరచితివో..ఓ ఓ ఓ ఓ పేదరికమ్ము ప్రేమపధమ్ము..మూసివేసినదా నా ఆశే దోచినదా..ఆఆ అంతా భ్రాంతియేనా..జీవితానా వెలుగింతేనా ఆశా నిరాశేనా..మిగిలేది చింతేనా చరణం::2 మనసునలేని వారి సేవలతో ఓ ఓ మనసునలేని వారి సేవలతో ఓ ఓ మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ వంతలపాలై చింతించేనా వంతా దేవదా నా వంతా దేవదా..ఆఆ అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
సంగీతం::C.R.సుబ్బరామన్ రచన::సముద్రాల సీనియర్ గానం::ఘంటసాల నిర్మాత::చక్రపాణి దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య సంస్థ::వినొదా పిక్చర్స్ నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,S.V.,రంగారావు. పల్లవి: కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్ సుడిలో దూకి ఎదురీదకా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ సుడిలో దూకీ ఎదురీదకా మునకే సుఖమనుకోవోయ్..మునకే సుఖమనుకోవోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్ చరణం::1 మేడలోనే అల పైడి బొమ్మా..నీడనే చిలకమ్మా ఆ అ అ అ అ ఆ..ఆ అ అ అ అ ఆ మేడలోనే అల పైడి బొమ్మా..నీడనే చిలకమ్మా..ఆ ఆ కొండలే రగిలే వడగాలీ..కొండలే రగిలే వడగాలీ నీ సిగలో పూవేలోయ్..నీ సిగలో పూవేలోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్ చరణం::2 చందమామా మసకేసి పోయే ముందుగా..కబురేలోయ్ చందమామా మసకేసి పోయే ముందుగా..కబురేలోయ్ లాయిరీ నడిసంద్రములోనా..లాయిరీ నడిసంద్రములోనా లంగరుతో పని లేదోయ్..లంగరుతో పని లేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్
సంగీత::పెండ్యాల నాగేశ్వరరావు రచన::రాజశ్రీ గానం::P.సుశీల విశ్వజ్యోతి పిక్చర్స్ వారి దర్శకత్వం::మానాపురం అప్పారావు తారాగణం::హరనాధ్,గుమ్మడి,చంద్రమోహన్,అంజలీదేవి, B.సరోజాదేవి,పండరీబాయి. పల్లవి:: అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే ఏ కంటిలోన నలుసు పడిన బాధ ఒక్కటే బాధ ఒక్కటే అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే ఏ కంటిలోన నలుసు పడిన బాధ ఒక్కటే బాధ ఒక్కటే అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే చరణం::1 చెడ్డవారితో చెలిమి చేయకూడదూ ఎగతాళికైననూ కల్లలాడకూడదూ చెడ్డవారితో చెలిమి చేయకూడదూ ఎగతాళికైననూ కల్లలాడకూడదూ కలిమి కలిగినా మనిషి మారకూడదూ మీ మనసులోన మంచితనము విడువకూడదూ ఈ తల్లిమాట జీవితాన మరువకూడదూ అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే ఏ కంటిలోన నలుసు పడిన బాధ ఒక్కటే బాధ ఒక్కటే అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే చరణం::2 శ్రద్దగాను చదువులెన్నొ చదవాలీ మీకు బుద్దిమంతులనే పేరు రావాలీ శ్రద్దగాను చదువులెన్నొ చదవాలీ మీకు బుద్దిమంతులనే పేరు రావాలీ రామలక్ష్మణుల రీతి మెలగాలీ మీరు కలకాలం కలిసి మెలిసి ఉండాలీ ఈ తల్లి కన్న పసిడి కలలు పండాలీ అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే ఏ కంటిలోన నలుసు పడిన బాధ ఒక్కటే బాధ ఒక్కటే అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే
అహహా..హా..ఆ.ఆ.ఆహా నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది
ఆమె చిరునవ్వులోనే హాయున్నది మనసు పులకించగా మధురభావాలు నాలోన కలిగించిందీ నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది
చరణం::1 ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ... మరచిపోలేను ఆ రూపు ఏనాటికి మరచిపోలేను ఆ రూపు ఏనాటికి మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి తలచుకొనగానే ఎదో ఆనందము తలచుకొనగానే ఎదో ఆనందము వలపు జనియించగా ప్రణయగీతాలు నాలోన పలికించింది
నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది
పల్లవి:: జగమే మారినది మధురముగా ఈ వేళా జగమే మారినది మధురముగా ఈ వేళా కలలూ కోరికలూ తీరినవీ మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళా
చరణం::1
మనసాడెనే మయూరమై పావురములు పాడె యెల పావురములు పాడె ఇదె చేరెను గోరువంక రామ చిలుక చెంత అవి అందాలా జంట నెనరూ కూరిమీ ఈ నాడే పండెనూ..నెనరూ కూరిమీ ఈ నాడే పండెనూ జీవిత మంతా చిత్రమైన పులకింతా
జగమే మారినది మధురముగా ఈ వేళా కలలూ కోరికలూ తీరినవీ మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళా
చరణం::2
విరజాజుల సువాసనా స్వాగతములు పలుకా సుస్వాగతములు పలుక ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ... విరజాజుల సువాసనా స్వాగతములు పలుకా సుస్వాగతములు పలుక తిరుగాడును తేనెటీగ తియ్యదనము కోరీ అనురాగాల తేలీ కమ్మని భావమే కన్నీరై చిందెనూ..కమ్మని భావమే కన్నీరై చిందెనూ ప్రియమగు చెలిమీ సాటి లేని కలిమీ........
జగమే మారినది మధురముగా ఈ వేళా కలలూ కోరికలూ తీరినవీ మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళా
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు ఆ కలిమి కూడా దోచుకొనే దొరలు ఎందుకు?
మనిషి పోతె మాత్రమేమి మనసు ఉంటది మనసు తోటి మనసెపుడో కలసి పోతది మనిషి పోతె మాత్రమేమి మనసు ఉంటది మనసు తోటి మనసెపుడో కలసి పోతది చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది జనమ జనమ కది మరీ గట్టి పడతది