Sunday, December 04, 2011

దేశద్రోహులు--1964


ఘంటసాల గారి పుట్టిన రోజు సంధర్భంగా ఈ పాట





సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల

పల్లవి::
జగమే మారినది మధురముగా ఈ వేళా
జగమే మారినది మధురముగా ఈ వేళా
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళా

చరణం::1

మనసాడెనే మయూరమై పావురములు పాడె యెల పావురములు పాడె
ఇదె చేరెను గోరువంక రామ చిలుక చెంత అవి అందాలా జంట
నెనరూ కూరిమీ ఈ నాడే పండెనూ..నెనరూ కూరిమీ ఈ నాడే పండెనూ
జీవిత మంతా చిత్రమైన పులకింతా

జగమే మారినది మధురముగా ఈ వేళా
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళా

చరణం::2

విరజాజుల సువాసనా స్వాగతములు పలుకా సుస్వాగతములు పలుక
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ...
విరజాజుల సువాసనా స్వాగతములు పలుకా సుస్వాగతములు పలుక
తిరుగాడును తేనెటీగ తియ్యదనము కోరీ అనురాగాల తేలీ
కమ్మని భావమే కన్నీరై చిందెనూ..కమ్మని భావమే కన్నీరై చిందెనూ
ప్రియమగు చెలిమీ సాటి లేని కలిమీ........

జగమే మారినది మధురముగా ఈ వేళా
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళా

No comments: