సంగీత::పెండ్యాల నాగేశ్వరరావు రచన::రాజశ్రీ గానం::P.సుశీల విశ్వజ్యోతి పిక్చర్స్ వారి దర్శకత్వం::మానాపురం అప్పారావు తారాగణం::హరనాధ్,గుమ్మడి,చంద్రమోహన్,అంజలీదేవి, B.సరోజాదేవి,పండరీబాయి. పల్లవి:: అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే ఏ కంటిలోన నలుసు పడిన బాధ ఒక్కటే బాధ ఒక్కటే అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే ఏ కంటిలోన నలుసు పడిన బాధ ఒక్కటే బాధ ఒక్కటే అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే చరణం::1 చెడ్డవారితో చెలిమి చేయకూడదూ ఎగతాళికైననూ కల్లలాడకూడదూ చెడ్డవారితో చెలిమి చేయకూడదూ ఎగతాళికైననూ కల్లలాడకూడదూ కలిమి కలిగినా మనిషి మారకూడదూ మీ మనసులోన మంచితనము విడువకూడదూ ఈ తల్లిమాట జీవితాన మరువకూడదూ అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే ఏ కంటిలోన నలుసు పడిన బాధ ఒక్కటే బాధ ఒక్కటే అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే చరణం::2 శ్రద్దగాను చదువులెన్నొ చదవాలీ మీకు బుద్దిమంతులనే పేరు రావాలీ శ్రద్దగాను చదువులెన్నొ చదవాలీ మీకు బుద్దిమంతులనే పేరు రావాలీ రామలక్ష్మణుల రీతి మెలగాలీ మీరు కలకాలం కలిసి మెలిసి ఉండాలీ ఈ తల్లి కన్న పసిడి కలలు పండాలీ అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే ఏ కంటిలోన నలుసు పడిన బాధ ఒక్కటే బాధ ఒక్కటే అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే