Sunday, December 04, 2011

భూకైలాసం--1958

ఘంటసాల పుట్టిన రోజు నాడు వారిని తలచుకొంటూ
వారు పాడిన పాటల్లో నేను చాలా ఇష్టపడే పాట
మీ అందరి....కోసం నాకోసం....విందామా :)




సంగీతం::గోవర్ధన్,సుదర్సనం

రచన::సీనియర్ సముద్రాలా
గానం::ఘంటసాల


సాకీ::
ద్వారపాలుర మరల దరిచేయి కృపయో
ధరలోన ధర్మంబు నెలకొల్పు నెపమో
రాముని అవతారం రవికుల సోముని అవతారం

పల్లవి::

రాముని అవతారం రవికుల సోముని అవతారం
రాముని అవతారం రవికుల సోముని అవతారం
సుజన జనావన ధర్మాకారం..దుర్జన హృదయవిదారం
రాముని అవతారం

చరణం::1

దాశరధిగ శ్రీకాంతుడువెలయు..కౌసల్యా సతి తపము ఫలించు
జన్మింతురు సహజాతులు మువ్వురు..జన్మింతురు సహజాతులు మువ్వురు
లక్ష్మణ..శత్రుజ్ఞా..భరతా......ఆఆ

రాముని అవతారం రవికుల సోముని అవతారం !!

చరణం::2

చదువులు నేరుచు మిషచేతా..చాపము దాలుచి చేతా
విశ్వామిత్రుని వెనువెంట..యాగము కావగ చనునంట
అంతము చేయునహల్యకు శాపం..అంతము చేయునహల్యకు శాపం
ఒసగును సుందర రూపం.........

రాముని అవతారం రవికుల సోముని అవతారం !!

చరణం::3

ధనువో జనకుని మనమున భయమో..ధారుణి కన్యా సంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో..దనుజులు కలగను సుఖగోపురమో
విరిగెను మిధిలా నగరమునా..ఆఆ

రాముని అవతారం రవికుల సోముని అవతారం !!

చరణం::4

కపటనాటకుని పట్టాభిషేకం..కలుగు తాత్కాలికా శోకం
భీకర కానన వాసారంభం..లోకోధరణకు ప్రారంభం..మ్మ్
భరతుని కోరిక తీర్చుటకోసం..పాదుకలొసగే ప్రేమావేశం
భరతుని కోరిక తీర్చుటకోసం..పాదుకలొసగే ప్రేమావేశం
నరజాతికి నవసంతోషం..గురుజనసేవకు ఆదేశం

రాముని అవతారం రవికుల సోముని అవతారం !!

చరణం::5

అదిగో చూడుము బంగరు జింకా..అదిగో చూడుము బంగరు జింకా
మన్నై చనునయ్యో లంకా..
వరనయనాగ్ని పరాంగన వంకా..అరిగిన మరణమె నీకింకా
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ..వానరకుల పుంగవ హనుమాన్
ముద్రికకాదిది భువనమిదానం..ముద్రికకాదిది భువనమిదానం
జీవన్ముక్తికి సోపానం....జీవన్ముక్తికి సోపానం
రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకులశోమా
సీతా శోకవినాశనకారి లంకా వైభవ సంహారీ.........
అయ్యో రావణ భక్తాగ్రేసర అమరంబౌనిక నీ చరితా
సమయును పరసతిపై మమకారం వెలయును ధర్మ విచారం

రాముని అవతారం రవికుల సోముని అవతారం
రాముని అవతారం రవికుల సోముని అవతారం !!

No comments: