సంగీతం::C.R.సుబ్బరామన్ రచన::సముద్రాల సీనియర్ గానం::K.రాణి నిర్మాత::చక్రపాణి దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య సంస్థ::వినొదా పిక్చర్స్ నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,s.v.రంగారావు. పల్లవి:: అంతా భ్రాంతియేనా..జీవితానా వెలుగింతేనా ఆశా నిరాశేనా..మిగిలేది చింతేనా..ఆఆ అంతా భ్రాంతియేనా..జీవితానా వెలుగింతేనా ఆశా నిరాశేనా..మిగిలేది చింతేనా.. చరణం::1 చిలిపితనాల..చెలిమే మరచితివో..ఓ ఓ ఓ ఓ చిలిపితనాల..చెలిమే మరచితివో..ఓ ఓ ఓ ఓ తలిదండ్రుల మాటే..దాట వెరచితివో..ఓ ఓ ఓ ఓ తలిదండ్రుల మాటే..దాట వెరచితివో..ఓ ఓ ఓ ఓ పేదరికమ్ము ప్రేమపధమ్ము..మూసివేసినదా నా ఆశే దోచినదా..ఆఆ అంతా భ్రాంతియేనా..జీవితానా వెలుగింతేనా ఆశా నిరాశేనా..మిగిలేది చింతేనా చరణం::2 మనసునలేని వారి సేవలతో ఓ ఓ మనసునలేని వారి సేవలతో ఓ ఓ మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ వంతలపాలై చింతించేనా వంతా దేవదా నా వంతా దేవదా..ఆఆ అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
సంగీతం::C.R.సుబ్బరామన్ రచన::సముద్రాల సీనియర్ గానం::ఘంటసాల నిర్మాత::చక్రపాణి దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య సంస్థ::వినొదా పిక్చర్స్ నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,S.V.,రంగారావు. పల్లవి: కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్ సుడిలో దూకి ఎదురీదకా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ సుడిలో దూకీ ఎదురీదకా మునకే సుఖమనుకోవోయ్..మునకే సుఖమనుకోవోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్ చరణం::1 మేడలోనే అల పైడి బొమ్మా..నీడనే చిలకమ్మా ఆ అ అ అ అ ఆ..ఆ అ అ అ అ ఆ మేడలోనే అల పైడి బొమ్మా..నీడనే చిలకమ్మా..ఆ ఆ కొండలే రగిలే వడగాలీ..కొండలే రగిలే వడగాలీ నీ సిగలో పూవేలోయ్..నీ సిగలో పూవేలోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్ చరణం::2 చందమామా మసకేసి పోయే ముందుగా..కబురేలోయ్ చందమామా మసకేసి పోయే ముందుగా..కబురేలోయ్ లాయిరీ నడిసంద్రములోనా..లాయిరీ నడిసంద్రములోనా లంగరుతో పని లేదోయ్..లంగరుతో పని లేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్
సంగీతం::C.R.సుబ్బరామన్ రచన::సముద్రాల సీనియర్ గానం::ఘంటసాల,కె.రాణి నిర్మాత::చక్రపాణి దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య సంస్థ::వినొదా పిక్చర్స్ నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,ఎస్వి,రంగారావు. పల్లవి:: ఓ..హొహొ..ఓ..హో..ఓ..హొహొఓహో.. ఓ..హొహొ..ఓ..హో..ఓ..హొహొఓహో.. ఓ దేవదా..ఓ పార్వతీ చదువు ఇదేనా..మనవాసి వదిలేసి అసలు దొరల్లే..సూటుబూటా ఓ దేవద..చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటుబూటా ఓ దేవద.. చరణం::1 పల్లెటూరి పిల్లకు..ఉలుకు హెచ్చిందే బదులు పల్కడము..పట్టుబడిందే పల్లెటూరి పిల్లకు..ఉలుకు హెచ్చిందే బదులు పల్కడము..పట్టుబడిందే పసికూన సిసలైన జాణ అయ్యిందే..బాగు బాగు పసికూన సిసలైన జాణ అయ్యిందే..బాగు బాగు ఓ పార్వతీ చరణం::2 ఉన్న తీరు మారినా..ఊరు మారినా తమరు ఎన్నటికీ..పసివారేనోయ్ ఉన్న తీరు మారినా..ఊరు మారినా తమరు ఎన్నటికీ..పసివారేనోయ్ అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా..నిజమయ్యేనా అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా..నిజమయ్యేనా ఓ పార్వతీ చరణం::3 నా ఎదుటే నీ బడాయి? జీవితమే ఓ లడాయి! నా ఎదుటే నీ బడాయి? జీవితమే ఓ లడాయి! లడాయిలా సరే మనకు..జిలాయిలోయ్ జిలాయిలోయ్ లడాయిలా సరే మనకు..జిలాయిలోయ్ జిలాయిలోయ్ ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా..ఉడుకూమోతా ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా..ఉడుకూమోతా ఓ పిరికి పార్వతీ... ఓ దుడుకు దేవద...
నిర్మాత::చక్రపాణి దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య సంస్థ::వినొదా పిక్చర్స్ నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,ఎస్వి,రంగారావు. పల్లవి:: కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే..ఓ ఓ ఓ కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే పసితనపూ మనోరథం వెన్నెలనీడై పోయేనులే..బ్రతుకింతేనులే పసితనపూ మనోరథం వెన్నెలనీడై పోయేనులే..బ్రతుకింతేనులే..ఓ ఓ ఓ కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే చరణం::1 ఎవియో మురిపాలెటకో పయనాలు..దైవాల నీమాలింతే ఎవియో మురిపాలెటకో పయనాలు..దైవాల నీమాలింతే..వరమింతే చివురించిన పూదీవే విరియగా..విరితావులు దూరాలై చనేనులే ప్రేమ ఇంతేలే..పరిణామమింతేలే
కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే చరణం::2 నెరవేరని ఈ మమకారాలేమో..ఈ దూరభారాలేమో..ఓ ఓ నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో..హితవేమో ఎది నేరని ప్రాయానా చనువునా..రవళించిన రాగమ్మే స్థిరమ్మౌ యోగమింతేలే..అనురాగమింతేలే కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే..ఇంతేనులే