Sunday, December 04, 2011

దేశద్రోహులు--1964




సంగీతం::సాలూరి రాజేశ్వరరావు గారు
రచన::ఆరుద్ర గారు
దర్శకత్వం: బోళ్ళ సుబ్బారావు
గానం::ఘంటసాల గారు,P.సుశీల గారు.

{ కల్యాణి రాగం }

ఆ ఆ ఆ ఆ ఆ ఆ

జగమే మారినదీ మధురముగా ఈ వేళా..
జగమే మారినదీ మధురముగా ఈ వేళా
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినదీ మధురముగా ఈ వేళా..

మనసాడెనే మయూరమై పావురములు పాడే..ఎల పావురములు పాడే
మనసాడెనే మయూరమై పావురములు పాడే..ఎల పావురములు పాడే
ఇదే చేరెను గోరువంక రామ చిలుక చెంత అవి అందాల జంట..
ఇదే చేరెను గోరువంక రామ చిలుక చెంత అవి అందాల జంట
నెనరు కూరిమి ఈనాడే పండెను..
నెనరు కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింతా..

జగమే మారినదీ మధురముగా ఈ వేళా..
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినదీ మధురముగా ఈ వేళా..

విరజాజులా సువాసనా స్వాగతములు పలుక..సుస్వాగతములు పలుక
తిరుగాడును తేనెటీగ తీయదనము కోరి..అనురాగాలా తేలి
ఎదలో ఇంతటి సంతోషమెందుకో..ఎదలో ఇంతటి సంతోషమెందుకో
ఎవ్వరి కోసమో..ఎందుకింత పరవశమో..

జగమే మారినదీ మధురముగా ఈ వేళా..
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినదీ మధురముగా ఈ వేళా..

No comments: