Sunday, December 04, 2011

మూగమనసులు--1964




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల


ముద్దబంతి పువ్వులో
మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలూ
ఎందరికీ తెలుసులే

ముద్దబంతి పువ్వులో
మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలూ
ఎందరికీ తెలుసులే


పూల దండలో ధారం దాగుందని తెలుసును
పాల గుండెలో ఏదీ దాగుందో తెలుసునా
పూల దండలో ధారం దాగుందని తెలుసును
పాల గుండెలో ఏదీ దాగుందో తెలుసునా
నవ్వినా ఏడ్చినా..నవ్వినా ఏడ్చినా
కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నిరెనకాలా ఏముందో తెలుసుకో

ముద్దబంతి పువ్వులో
మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలూ
ఎందరికీ తెలుసులే


మనసుమూగదే కాని బాసుంటది దానికి
చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇదీ
మనసుమూగదే కాని బాసుంటది దానికి
చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇదీ
యదమీద యెదపెట్టి సొదలన్ని ఇనుకో
ఇనుకునీ బ్రతుకును ఇంపుగా దిద్దుకో

ముద్దబంతి పువ్వులో
మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలూ
ఎందరికీ తెలుసులే


ముక్కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు
ముందు జనమ భందాలు ముడియేసి పెడతారు
ముక్కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు
ముందు జనమ భందాలు ముడియేసి పెడతారు
కన్నోళ్ళా కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు
కన్నోళ్ళా కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు
మూగమనసు బాసలూ..ఊ..ఈ మూగమనసు బాసలు
మీకిద్దరికీ సేవలు

ముద్దబంతి పువ్వులో
మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలూ
ఎందరికీ తెలుసులే

No comments: