Monday, December 05, 2011

మాతృమూర్తి--1972

















సంగీత::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::రాజశ్రీ
గానం::P.సుశీల
విశ్వజ్యోతి పిక్చర్స్ వారి
దర్శకత్వం::మానాపురం అప్పారావు
తారాగణం::హరనాధ్,గుమ్మడి,చంద్రమోహన్,అంజలీదేవి, B.సరోజాదేవి,పండరీబాయి.

పల్లవి::

అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే
ఏ కంటిలోన నలుసు పడిన బాధ ఒక్కటే బాధ ఒక్కటే
అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే
ఏ కంటిలోన నలుసు పడిన బాధ ఒక్కటే బాధ ఒక్కటే
అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే

చరణం::1

చెడ్డవారితో చెలిమి చేయకూడదూ
ఎగతాళికైననూ కల్లలాడకూడదూ
చెడ్డవారితో చెలిమి చేయకూడదూ
ఎగతాళికైననూ కల్లలాడకూడదూ
కలిమి కలిగినా మనిషి మారకూడదూ
మీ మనసులోన మంచితనము విడువకూడదూ
ఈ తల్లిమాట జీవితాన మరువకూడదూ
అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే
ఏ కంటిలోన నలుసు పడిన బాధ ఒక్కటే బాధ ఒక్కటే
అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే

చరణం::2

శ్రద్దగాను చదువులెన్నొ చదవాలీ
మీకు బుద్దిమంతులనే పేరు రావాలీ
శ్రద్దగాను చదువులెన్నొ చదవాలీ
మీకు బుద్దిమంతులనే పేరు రావాలీ
రామలక్ష్మణుల రీతి మెలగాలీ
మీరు కలకాలం కలిసి మెలిసి ఉండాలీ
ఈ తల్లి కన్న పసిడి కలలు పండాలీ
అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే
ఏ కంటిలోన నలుసు పడిన బాధ ఒక్కటే బాధ ఒక్కటే
అమ్మకు మీరిద్దరూ..ఒకటే..ఒకటే

No comments: