సంగీత::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::రాజశ్రీ
గానం::జమునారాణి
విశ్వజ్యోతి పిక్చర్స్ వారి
దర్శకత్వం::మానాపురం అప్పారావు
తారాగణం::హరనాధ్,గుమ్మడి,చంద్రమోహన్,అంజలీదేవి, B.సరోజాదేవి,పండరీబాయి.
పల్లవి::
ఒరె ఒరె ఒరె ఒరె...సయ్యడ
ఎడముగం పెడముగం...ఏంది ఈ కథా
ఉలకరూ పలకరూ...ఏంది ఈ రథా
చరణం::1
ఒరె ఒరె ఒరె..పాల గువ్వలాంటి పసందైన చిన్నదీ
అవ్వా..మొగలి పువ్వులాగ మొగం..ముడుచుకున్నదీ
పాల గువ్వలాంటి...పసందైన చిన్నదీ
మొగలి పువ్వులాగ మొగం..ముడుచుకున్నదీ
అందగాడి పక్కనైనా...పసిడి బుగ్గలూ
మందారా పూల లాగ కందెనెందుకో కందెనెందుకో
ఇది చిరాకో పరాకో..గడసరి అలకో..అయ్యయ్యో
ఎడముగం పెడముగం...ఏంది ఈ కథా
ఉలకరూ పలకరూ...ఏంది ఈ రథా
చరణం::2
కోరి కట్టుకున్నదని...ఏడిపించకా
అలుసు చేసి ఆడితే...అందదు చిలకా
ఆడదాని దోరమనసు...యెన్న లాటిదీ
ఆడదాని దోరమనసు...యెన్న లాటిదీ
ఆశ తెలిసి మసిలితే...కరిగిపోతదీ
కరిగిపోతదీ..ఈ చిరాకూ పరాకూ ఎగిరిపోతదీ
ఎడముగం పెడముగం...ఏంది ఈ కథా
ఉలకరూ పలకరూ...ఏంది ఈ రథా
చరణం::3
ఒహొహొ ఒహొహొ..ఆహహ ఆహహ
ఆలు మగల తగవు..రచ్చకెక్కకూడదూ
పట్టువిడుపు లేకుంటే..మనువే కాదూ
ఆలు మగల తగవు..రచ్చకెక్కకూడదూ
పట్టువిడుపు లేకుంటే...మనువే కాదూ
వగలు చూపి ఒడుపుగా..వల యిసరాలీ
వగలు చూపి ఒడుపుగా..వల యిసరాలీ
మగవాడిని నీ కొంగున..ముడి వెయ్యాలీ
నా పలుకులో కిటుకునూ..తెలిసి నడుసుకో
య్యే..ఎడముగం పెడముగం...ఏంది ఈ కథా
ఉలకరూ పలకరూ...ఏంది ఈ రథా
ఎడముగం పెడముగం...ఏంది ఈ కథా
ఉలకరూ పలకరూ...ఏంది ఈ రథా
No comments:
Post a Comment