సంగీతం::S. రాజేశ్వర రావ్
రచన:::కోసరాజు
గానం::ఘంటసాల
రాగం::ఆభేరి
{భీంపలాశ్రీ-ఖరహరప్రియ}
పల్లవి::
అహహా..హా..ఆ.ఆ.ఆహా
నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అంద చందాల రాణి ఆ చిన్నది
నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అంద చందాల రాణి ఆ చిన్నది
ఆమె చిరునవ్వులోనే హాయున్నది
మనసు పులకించగా మధురభావాలు నాలోన కలిగించిందీ
నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అంద చందాల రాణి ఆ చిన్నది
చరణం::1
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
మరచిపోలేను ఆ రూపు ఏనాటికి
మరచిపోలేను ఆ రూపు ఏనాటికి
మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి
మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి
తలచుకొనగానే ఎదో ఆనందము
తలచుకొనగానే ఎదో ఆనందము
వలపు జనియించగా ప్రణయగీతాలు నాలోన పలికించింది
నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అంద చందాల రాణి ఆ చిన్నది
చరణం::2
సోగ కనులారా చూచింది సొంపారగా
సోగ కనులారా చూచింది సొంపారగా
మూగ కోరికలు చిగిరించే ఇంపారగ
మూగ కోరికలు చిగిరించే ఇంపారగ
నడచిపోయిందీ ఎంతో నాజూకుగా
నడచిపోయిందీ ఎంతో నాజూకుగా విడచి మనజాలనూ
విరహ తాపాలు మోహాలు కలిగించింది
నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అంద చందాల రాణి ఆ చిన్నది
అంద చందాల రాణి ఆ చిన్నది
No comments:
Post a Comment