Sunday, December 04, 2011

మూగమనసులు--1964




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటశాల

తారాగణం::అక్కినేని,సావిత్రి,గుమ్మడి,నాగభూషణం,జమున,పద్మనాభం,అల్లు రామలింగయ్య.

::::::::

పాడుతా తీయగా చల్లగా

పాడుతా తీయగా చల్లగా..
పసిపాపలా నిదరపో తల్లిగా..బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా

కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు
ఆ కలిమి కూడా దోచుకొనే దొరలు ఎందుకు?

పాడుతా తీయగా చల్లగా..
పసిపాపలా నిదురపో తల్లిగా..బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా

గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్లు
ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు
గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్లు
ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు
పోయినోళ్ళు అందరు మంచోళ్ళు
పోయినోళ్ళు అందరు మంచోళ్ళు
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు

పాడుతా తీయగా చల్లగా
పసిపాపలా నిదురపో తల్లిగా..బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా

మనిషి పోతె మాత్రమేమి మనసు ఉంటది
మనసు తోటి మనసెపుడో కలసి పోతది
మనిషి పోతె మాత్రమేమి మనసు ఉంటది
మనసు తోటి మనసెపుడో కలసి పోతది
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది
జనమ జనమ కది మరీ గట్టి పడతది

పాడుతా తీయగా చల్లగా..
పసిపాపలా నిదురపో తల్లిగా..బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా..

No comments: