సంగీతం::C.R.సుబ్బరామన్
రచన::సముద్రాల సీనియర్
గానం::K.రాణి
నిర్మాత::చక్రపాణి
దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
సంస్థ::వినొదా పిక్చర్స్
నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,s.v.రంగారావు.
పల్లవి::
అంతా భ్రాంతియేనా..జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా..మిగిలేది చింతేనా..ఆఆ
అంతా భ్రాంతియేనా..జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా..మిగిలేది చింతేనా..
చరణం::1
చిలిపితనాల..చెలిమే మరచితివో..ఓ ఓ ఓ ఓ
చిలిపితనాల..చెలిమే మరచితివో..ఓ ఓ ఓ ఓ
తలిదండ్రుల మాటే..దాట వెరచితివో..ఓ ఓ ఓ ఓ
తలిదండ్రుల మాటే..దాట వెరచితివో..ఓ ఓ ఓ ఓ
పేదరికమ్ము ప్రేమపధమ్ము..మూసివేసినదా
నా ఆశే దోచినదా..ఆఆ
అంతా భ్రాంతియేనా..జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా..మిగిలేది చింతేనా
చరణం::2
మనసునలేని వారి సేవలతో ఓ ఓ
మనసునలేని వారి సేవలతో ఓ ఓ
మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ
మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ
వంతలపాలై చింతించేనా వంతా దేవదా
నా వంతా దేవదా..ఆఆ
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
No comments:
Post a Comment