Thursday, February 26, 2009

చుట్టాలున్నారు జాగ్రత్తా--1980

కృష్ణ గారి ఈ పాట మీరు విని తీరాల్సిందే

ఓ అమ్మాయి, అబ్బాయిని ఏడిపిస్తూ పాడే పాట లలో ఇదే బెస్ట్ ఏమో
అందులోను ఆ గడసరి అమ్మాయి పాత్రలో శ్రీదేవి..
అంతకు అంత బదులు చెప్పే అబ్బాయిగా మన కృష్ణా గారు...
సూపర్ :-) ఆయన స్టెప్స్ గురించి ఇక చెప్పనే అక్కరల్లేదు.


సంగీతం::M.S..విశ్వనాధన్
రచన::సినారె
గానం::P.సుశీల,S.P.బాలు

రా రా రా రావయ్యా రామేశం...ఏమయ్యా ఆవేశం...
నాజూకు చూపావో నా చుట్టూ తిప్పిస్తాను
గిరుక్కు గిరుక్కు గిరుక్కున గిర గిర గిర గిర గిర...

చిన్నారి నాంచారీ మన్నించూ ఈ సారీ..
నా వెంటే పడుతుంటే నీ భరతం పట్టిస్తాను..
తళాంగు తళాంగు తళాంగుతోం తక తక తక తక తక

నిలువూ ఏమంత బిగువూ..నిను నిలదీసి వలవేసి లాగేస్తా
అందాక నువ్వొస్తే ఆపైన నే చూస్తా తీరా నువు లాగేస్తే
తీయంగా అంటిస్తా..చురుక్కు చురుక్కు చురుక్కున
చుర చుర చుర చుర చుర
రమ్మంటూ నేనంటే..రానంటూ నువ్వుంటే గారాలే పోతుంటే..
నీ బుగ్గ చిదిమేస్తాను చిటుక్కు చిటుక్కు చిటుక్కున
చిట చిట చిట చిట చిట

చిన్నారి నాంచారీ మన్నించూ ఈ సారీ..
నా వెంటే పడుతుంటే నీ భరతం పట్టిస్తాను..
తళాంగు తళాంగు తళాంగుతోం తక తక తక తక తక

అలకా బంగారు తునకా..ఏదో అలవోకగా అంటే అంత కినుకా..
అలకా బంగారు తునకా..ఏదో అలవోకగా అంటే అంత కినుకా...
నీ వైనం చూస్తుంటే హైరానా అవుతుందీ..నీ అల్లరి చూస్తుంటే నా
గుండే అంటుంది కలుక్కు కలుక్కు కలుక్కునా కల కల కల కల కల

రమ్మటూ నువ్వంటే రానంటూ నేనుంటే నా మాటా వినకుంటే
నీ ఆట కట్టిస్తాను గబుక్కు గబుక్కు గబుక్కున గబ గబ గబ గబ గబ

రా రా రా రావయ్యా రామేశం...ఏమయ్యా ఆవేశం...
నాజూకు చూపావో నా చుట్టూ తిప్పిస్తాను
గిరుక్కు గిరుక్కు గిరుక్కున గిర గిర గిర గిర గిర...

చిన్నారి నాంచారీ మన్నించూ ఈ సారీ..
నా వెంటే పడుతుంటే నీ భరతం పట్టిస్తాను..
తళాంగు తళాంగు తళాంగుతోం తక తక తక తక తక

No comments: