Showing posts with label Lyricist::Samudrala Raghavacharya(Senior). Show all posts
Showing posts with label Lyricist::Samudrala Raghavacharya(Senior). Show all posts

Friday, February 24, 2017

భూకైలాస్--1958

బ్లాగు మిత్రులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు


సంగీతం::R.సుదర్శనం, మరియు R.గోవర్ధనం
రచన::సముద్రాల (సీనియర్)  
గానం::M.L.వసంతకుమారి
Film Directed By::K.Sankar
తారాగనం::నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వరరావు,S.V.రంగారావు,జమున,B.సరోజినిదేవి,హేమలత.

పల్లవి::

దేవ మహాదేవ మము బ్రోవుము శివా
దేవ మహాదేవ మము బ్రోవుము శివా
దేవ మహాదేవ మము బ్రోవుము శివా
భవ పాశ నాశనా భువనైక పోషణా
దేవ మహాదేవ మము బ్రోవుము శివా
భవ పాశ నాశనా భువనైక పోషణా..ఆ
దేవ మహాదేవ మము బ్రోవుము శివా..ఆ

చరణం::1

పరమ ప్రేమకార..నిఖిల జీవాధార
పరమ ప్రేమకార..నిఖిల జీవాధార
సకల పాప విదూర దరహాన గంభీర  
దేవ మహాదేవ మము బ్రోవుము శివా..ఆ

చరణం::2

దివ్య తేజోపూర్ణ తనయులను గన్నాను
దివ్య తేజోపూర్ణ తనయులను గన్నాను
దేవతా మాతలతో..పరియశము గొన్నాను
దేవతా మాతలతో..పరియశము గొన్నాను
కావుమా నా సుతల..చల్లగా గౌరీశ
కావుమా నా సుతల..చల్లగా గౌరీశ
ఈ వరము నాకొసగు..ప్రేమతో సర్వేశ 

దేవ మహాదేవ మము బ్రోవుము శివా..ఆ
భవ పాశ నాశనా భువనైక పోషణా..ఆ
దేవ మహాదేవ మము బ్రోవుము శివా..ఆ

Bhuukailaas--1958
Music::R.Sudarsanam, & R.Govardhanam
Lyrics::Samudraala  {Senior }
Singer::M.L.Vasantakumaari
Film Directed By::K.Sankar
Cast::N.T.RamaRao,A.N.R. , S.V.Rangaa Rao,Jamuna,B.Sarojaadevi,Hemalatha.

::::::::::::::::::::::::::::::::::::::::

dEva mahaadEva mamu brOvumu Sivaa
dEva mahaadEva mamu brOvumu Sivaa
dEva mahaadEva mamu brOvumu Sivaa
bhava paaSa naaSanaa bhuvanaika pOShaNaa 
dEva mahaadEva mamu brOvumu Sivaa
bhava paaSa naaSanaa bhuvanaika pOShaNaa..aa 
dEva mahaadEva mamu brOvumu Sivaa..aa

::::1

parama prEmakaara niKila jiivaadhaara
parama prEmakaara niKila jiivaadhaara
sakala paapa viduura darahaana gambhiira  
dEva mahaadEva mamu brOvumu Sivaa

::::2

divya tEjOpuurNa tanayulanu gannaanu
dEvataa maatalatO pariyaSamu gonnaanu
kaavumaa naa sutala callagaa gauriiSa
ii varamu naakosagu prEmatO sarvESa 

dEva mahaadEva mamu brOvumu Sivaa..aa
bhava paaSa naaSanaa bhuvanaika pOShaNaa..aa 
dEva mahaadEva mamu brOvumu Sivaa..aa

Monday, April 25, 2016

మాయాబజార్--1957




సంగీతం::ఘంటసాల గారు
రచన::సముద్రాల సీనియర్ 
గానం::ఘంటసాల గారు,P.లీల గారు
Film Directed By::K.V.Reddi
తారాగణం::N.T.R.A.N.R.సావిత్రి,S.V.రంగారావు,రేలంగి,రమణారెడ్డి,గుమ్మడి,ముక్కామల,C.S.R.,చాయాదేవి,ఋష్యేంద్రమణి,సూర్యకాంతం,అల్లురామలింగయ్య,మాధవపెద్ది సత్యం,ధుళిపాళ,మిక్కిలినేని,నాగభూషణం. 

పల్లవి::

నీకోసమె..నే జీవించునది
ఈ విరహములో..ఈ నిరాశలో
నీకోసమె..నే జీవించునది

వెన్నెల కూడా..చీకటియైనా
మనసున వెలుగే..లేక పోయినా 
నీకోసమె..నే జీవించునది

చరణం::1

విరహము కూడా..సుఖమే కాదా
నిరతము చింతన..మధురము కాదా
విరహము కూడా..సుఖమే కాదా
నిరతము చింతన..మధురము కాదా
వియోగ వేళల విరిసే ప్రేమల..విలువను కనలేవా 

నీ రూపమె నే ధ్యానించునది
నా హృదయములో..నా మనస్సులో 
నీరూపమె..నే ధ్యానించునది

చరణం::2

హృదయము నీతో వెడలిపోయినా..మదిలో ఆశలు మాసిపోయినా..ఆఆ
మన ప్రేమలనే మరి మరి తలచి..ప్రాణము నిలుపుకొనీ..ఈఈఈఇ
నీకోసమె..నే జీవించునది

చరణం::3

మెలకువనైనా కలలోనైనా..కొలుతును నిన్నే ప్రణయదేవిగా
లోకములన్ని ఏకమె అయినా..ఇక నా దానవెగా..ఆ ఆ ఆ
నీ రూపమెనే ధ్యానించునది..ఈ విరహాములో..ఈ నిరాశలో
నీకోసమె..నే జీవించునది

Maayaabajaar--1957
Music::Ghantasala Garu
Lyrics::Samudraala{ Senior}
Singer's::Ghantasala,P.Leela
Film Directed By::K.V.Reddi
Cast::N.T.R.A.N.R.Saavitri,S.V.Rangaaraavu,Relangi,Ramanaareddi,Gummadi,mukkaamala,C.S.R,Chaayaadevi,ఋష్యేంద్రమణి,Sooryakaantam,Alluraamalingayya,Maadhavapeddi satyam,dhuLipaaLa,
Mikkilineni,Naagabhushanam.

::::::::::::::::

neekOsame..nE jeevinchunadi
ii virahamulO..ii niraaSalO
neekOsame..nE jeevinchunadi

vennela kooDaa..cheekaTiyainaa
manasuna velugE..lEka pOyinaa 
neekOsame..nE jeevinchunadi

::::1

virahamu kooDaa..sukhamE kaadaa
niratamu chintana..madhuramu kaadaa
virahamu kooDaa..sukhamE kaadaa
niratamu chintana..madhuramu kaadaa
viyOga vELala virisE prEmala..viluvanu kanalEvaa 

nee roopame nE dhyaaninchunadi
naa hRdayamulO..naa manassulO 
neeroopame..nE dhyaaninchunadi

::::2

hRdayamu neetO veDalipOyinaa..madilO aaSalu maasipOyinaa..AA
mana prEmalanE mari mari talachi..praaNamu nilupukonee..iiiiiii
neekOsame..nE jeevinchunadi

::::3

melakuvanainaa kalalOnainaa..kolutunu ninnE praNayadEvigaa
lOkamulanni Ekame ayinaa..ika naa daanavegaa..aa aa aa
nee roopamenE dhyaaninchunadi..ii virahaamulO..ii niraaSalO
neekOsame..nE jeevinchunadi

మాయాబజార్--1957




సంగీతం::ఘంటసాల గారు
రచన::సముద్రాల సీనియర్ 
గానం::ఘంటసాల గారు,P.లీల గారు
Film Directed By::K.V.Reddi
తారాగణం::N.T.R.A.N.R.సావిత్రి,S.V.రంగారావు,రేలంగి,రమణారెడ్డి,గుమ్మడి,ముక్కామల,C.S.R.,చాయాదేవి,ఋష్యేంద్రమణి,సూర్యకాంతం,అల్లురామలింగయ్య,మాధవపెద్ది సత్యం,ధుళిపాళ,మిక్కిలినేని,నాగభూషణం. 

పల్లవి::

చూపులు కలసిన శుభవేళా..ఆ
ఎందుకు నీకీ కలవరము..ఎందుకు నీకీ కలవరము
ఉల్లాసముగా నేనూహించిన..అందమె నీలో చిందెనులే
చూపులు కలసిన శుభవేళా..ఎందుకు నీకీ కలవరము

చూపులు కలసిన శుభవేళా..ఆ
ఎందుకు నీకీ పరవశము..ఎందుకు నీకీ పరవశము
ఏకాంతములో ఆనందించిన..నా కలలే నిజమాయెనులే
చూపులు కలసిన శుభవేళ..ఎందుకు నీకీ పరవశము

చరణం::1

ఆలాపనలు సల్లాపములు..కలకల కోకిల గీతములే..ఏ..ఏ..ఏ
ఆలాపనలు సల్లాపములు..కలకల కోకిల గీతములే..ఏఏఏఏఏఏ
చెలువములన్ని..చిత్ర రచనలే..ఏ
చెలువములన్ని..చిత్ర రచనలే..ఏఏఏఏ
చలనములోహో..నాట్యములే
చూపులు కలసిన శుభవేళ..ఎందుకు నీకీ కలవరము

చరణం::2

శరముల వలనే చతురోక్తులను..చురుకుగా విసిరే నైజములే..ఏ..ఏ..ఏ
శరముల వలనే చతురోక్తులను..చురుకుగ విసిరే నైజములే
ఉద్యానమున వీర విహారమే..ఏ..ఏ 
ఉద్యానమున..వీర విహారమే..తెలిపెదనో హో శౌర్యములే
చూపులు కలసిన శుభవేళా..ఎందుకు నీకీ పరవశము
ఎందుకు నీకీ కలవరము

Maayaabajaar--1957
Music::Ghantasala Garu
Lyrics::Samudraala{ Senior}
Singer's::Ghantasala,P.Leela
Film Directed By::K.V.Reddi
Cast::N.T.R.A.N.R.Saavitri,S.V.Rangaaraavu,Relangi,Ramanaareddi,Gummadi,mukkaamala,C.S.R,Chaayaadevi,ఋష్యేంద్రమణి,Sooryakaantam,Alluraamalingayya,Maadhavapeddi satyam,
dhuLipaaLa,Mikkilineni,Naagabhushanam.

::::::::::::::::

choopulu kalasina SubhavELaa..aa
enduku neekee kalavaramu..enduku neekee kalavaramu
ullaasamugaa nEnoohinchina..andame neelO chindenulE
choopulu kalasina SubhavELaa..enduku neekee kalavaramu

choopulu kalasina SubhavELaa..aa
enduku neekee paravaSamu..enduku neekee paravaSamu
EkaantamulO aanandinchina..naa kalalE nijamaayenulE
choopulu kalasina SubhavELa..enduku neekee paravaSamu

::::1

aalaapanalu sallaapamulu..kalakala kOkila geetamulE..E..E..E
aalaapanalu sallaapamulu..kalakala kOkila geetamulE..EEEEEE
cheluvamulanni..chitra rachanalE..E
cheluvamulanni..chitra rachanalE..EEEE
chalanamulOhO..naaTyamulE
choopulu kalasina SubhavELa..enduku neekee kalavaramu

::::2

Saramula valanE chaturOktulanu..churukugaa visirE naijamulE..E..E..E
Saramula valanE chaturOktulanu..churukuga visirE naijamulE
udyaanamuna veera vihaaramE..E..E 
udyaanamuna..veera vihaaramE..telipedanO hO SauryamulE
choopulu kalasina SubhavELaa..enduku neekee paravaSamu
enduku neekee kalavaramu

Wednesday, March 30, 2016

విప్రనారాయణ--1954



సంగీతం::S.రాజేశ్వర్‌రావు  
రచన::సముద్రాల రాఘవాచార్య
గానం::P.భానుమతి,బృందం
Film Directed bY::Ramakrishna
తారాగణం::అక్కినేని,పి.భానుమతి,రేలంగి,వి.శివరాం,సంధ్య,అల్లు రామలింగయ్య,
ఆర్.నాగేశ్వరరావు

పల్లవి::

రంగ రంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
విరజానదియే శ్రీకావేరి పరమపదమ్మే శ్రీరంగం
విరజానదియే శ్రీకావేరి పరమపదమ్మే శ్రీరంగం
శ్రీరంగడే పరమాత్ము దేవుడు శరణను మోక్షమునొసగే దేవుడు

రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
శ్రీరంగా శ్రీరంగా శ్రీరంగా

రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార

Monday, November 09, 2015

సీతారామ కళ్యాణం--1961



సంగీతం::గాలిపెంచల నరసింహారావు
రచన::సముద్రాల రాఘవాచార్య సీనియర్ 
గానం::P.లీల
సినిమా దర్శకత్వం::నందమూరి తారక రామారావు
సినిమా నిర్మాణం::నందమూరి త్రివిక్రమరావు
తారాగణం::హరనాథ్,గీతాంజలి,ఎన్.టి.రామారావు,బి.సరోజాదేవి ,చిత్తూరు నాగయ్య,గుమ్మడి,మిక్కిలినేని,కాంతారావు,ఛాయాదేవి,కస్తూరి శివరావు,వల్లభజోస్యుల శివరాం,శోభన్‌బాబు,కొమ్మినేని శేషగిరిరావు.
బృందావని సారంగ::రాగం 

పల్లవి::

జగదేక మాతా గౌరీ..కరుణించవే
భవానీ కరుణించవే..భవానీ కరుణించవే

జగదేక మాతా గౌరీ..కరుణించవే
భావానీ కరుణించవే..భవానీ కరుణించవే

చరణం::1

ఘనమౌ శువుని ధనువు వంచి
ఘనమౌ శువుని ధనువు వంచి
జనకుని కోరిక తీరుట జేసి
మనసిజ మోహను రఘుకులేశుని
మనసిజ మోహను రఘుకులేశుని
స్వామిని జేయవే మంగళ గౌరీ
కరుణించవే భవానీ కరుణించవే

చరణం::2

నీ పదములను..లంకాపతిని
నీ పదములను..లంకాపతిని
నా పెన్నిధిగా..నమ్ముకొంటినే
నా పతికాపద..కలుగనీయక
నా పతికాపద..కలుగనీయక
కాపాడవే..మంగళ గౌరీ
కరుణించవే భవానీ..కరుణించవే
భవానీ..కరుణించవే
జగదేక మాతా గౌరీ..కరుణించవే
భవానీ కరుణించవే..భవానీ కరుణించవే

Seetaaraama Kalyaanam--1961
Music::Gaali Penchala
Lyrics::Samudrala Raghavaachaari 
Singer::P.Leela
Film Directed By::Nandamoori Taraka RamaRao
Film Producer By::Nandamoori Trivikramaraavu
Cast::Haranaath^,Geetaanjali,N.T.Raamaaraavu,B.Sarojaadevi ,Chittooru Naagayya,GummaDi,Mikkilineni,KaantaRao,Chayaadevi,Kastoori Sivarao,Vallabhajosyula Sivaraam,SobhanBaabu,Kommineni Seshagirirao.

Brundavani Saranga::raag

:::::::::::

jagadEka maataa gawree..karuNinchavE
bhavaanee karuNinchavE..bhavaanee karuNinchavE

jagadEka maataa gawree..karuNinchavE
bhavaanee karuNinchavE..bhavaanee karuNinchavE

::::1

ghanamau Suvuni dhanuvu vanchi
ghanamau Suvuni dhanuvu vanchi
janakuni kOrika teeruTa jEsi
manasija mOhanu raghukulESuni
manasija mOhanu raghukulESuni
swaamini jEyavE mangaLa gauree
karuNinchavE bhavaanee karuNinchavE

::::2

nee padamulanu..lankaapatini
nee padamulanu..lankaapatini
naa pennidhigaa..nammukonTinE
naa patikaapada..kaluganeeyaka
naa patikaapada..kaluganeeyaka
kaapaaDavE..mangaLa gauree

karuNinchavE bhavaanee..karuNinchavE
bhavaanee..karuNinchavE
jagadEka maataa gauree..karuNinchavE
bhavaanee karuNinchavE..bhavaanee karuNinchavE

Monday, September 21, 2015

భక్త ప్రహ్లాద--1967



సంగీతం::సాలూరి రాజేశ్వరరావు 
రచన::సముద్రాలరాఘవాచారి
గానం::P.సుశీల
తారాగణం::హరినాథ్,S.V.రంగారావు,అంజలిదేవి,బేబిరోజారమణి రమణారెడ్డి,

పల్లవి::

ఆదుకోవయ్యా..ఓ..రమేశా..ఆ..ఆదుకోవయ్యా
పతితపావన శ్రితజనావన సుజన జీవన మాధవ
భువననాయక ముక్తిదాయక భక్తపాలక కేశవా..ఆ
ఆదుకోవయ్యా

బృందం:: 

సర్వలోకకారణా..సకలశోక వారణా
జన్మజన్మకారణా..జన్మబంధ మోచనా..ఆ
దుష్టగర్వ శిక్షణా..శిష్ట శాంతి రక్షణా..శాంతి రక్షణా

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవే కదా 

జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు 
సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ 

నిన్నేగానీ పరులనెఱుంగా..రావే వరదా
బ్రోవగ రావే..వరదా..వరదా
అని మొరలిడగా..కరి విభు గాచిన
అని మొరలిడగా..కరి విభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా

హే ప్రభో...హే ప్రభో
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
కరుణాభరణా..కమలలోచనా
కరుణాభరణా..కమలలోచనా
కన్నుల విందువు చేయగా రావే
కన్నుల విందువు చేయగా రావే
ఆశృత భవ బంధ నిర్మూలనా
ఆశృత భవ బంధ నిర్మూలనా
లక్ష్మీ వల్లభా..లక్ష్మీ వల్లభా

నిన్నే నమ్మీ నీపద యుగళీ సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా ..పన్నగశయనా నారాయణా
జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవేకదా

భవజాధినిబడి తేలగలేని..జీవులబ్రోచే పరమపురుషా 
నను కాపాడి నీ బిరుదమునూ..నిలుపుకొంటివా శ్రితమందారా

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవేకదా

విశ్వమునిందీ వెలిగే నీవే..నాలో నుండీ నన్ను కావగా
విషమునుద్రావా వెరువగ్నేలా..విషధర శయనా విశ్వపాలనా

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవేకదా దేవా

Tuesday, August 04, 2015

షావుకారు--1950



సంగీతం::ఘంటసాలవేంకటేశ్వర రావు 
రచన::సముద్రాలరాఘావాచార్య(సీనియర్)  
గానం::P.baశాంతకుమారి,R.బాలసరస్వతిదేవి,బృందం  
తారాగణం:N.T.రామారావు,జానకి, S.V. రంగారావు, రేలంగి,మోపర్రు దాసు,పద్మనాభం, గోవిందరాజుల సుబ్బారావు,వంగర, కనకం,వల్లభజోస్యుల శివరాం, P.శాంతకుమారి

పల్లవి::

దీపావళీ..దీపావళి 
దీపావళీ..దీపావళి
ఇంటింట ఆనంద..దీపావళీ
ఇంటింట ఆనంద..దీపావళీ
మా ఇంట మాణిక్య..కళికావళి
మా ఇంట మాణిక్య..కళికావళి
దీపావళీ..దీపావళి 
దీపావళీ..దీపావళి

చరణం::1

జిలుగుల వలువల అళ్ళుళ్ళ తళుకు
జిలుగుల వలువల అళ్ళుళ్ళ తళుకు 
కూతుళ్ళ..కులుకు
పలుకుల వయ్యారి వదినెల వన్నెలు
పలుకుల వయ్యారి వదినెల వన్నెలు 
మురిసిపడు..చిన్నెలు
రంగు మతాబుల..శోభావళి
రంగు మతాబుల..శోభావళి

దీపావళీ..దీపావళి
ఇంటింట ఆనంద..దీపావళి
మా ఇంట మాణిక్య..కళికావళి
దీపావళీ..దీపావళి
  
చరణం::2

చిటపట రవ్వల..ముత్యాలు కురియ
చిటపట రవ్వల..ముత్యాలు కురియ 
రత్నాలు..మెరయ
తొలకరి స్నేహాలు..వలుపుల వానగ
తొలకరి స్నేహాలు..వలుపుల 
వానగ కురిసి..సెలయేరుగ
పొంగే ప్రమోద..తరంగావళీ
పొంగే ప్రమోద..తరంగావళి

దీపావళీ..దీపావళి
దీపావళీ..దీపావళి
ఇంటింట ఆనంద..దీపావళీ
ఇంటింట ఆనంద..దీపావళీ
మా ఇంట మాణిక్య..కళికావళీ
మా ఇంట మాణిక్య..కళికావళీ
దీపావళీ..దీపావళి
దీపావళీ..దీపావళి

Sunday, August 02, 2015

నర్తనశాల--1963



సంగీతం::సుసర్ల దక్షణామూర్తి
రచన::సముద్రాల,శ్రీశ్రీ కోసరాజు
గానం::ఘంటసాల గారు
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,శోభన్‌బాబు,L.విజయలక్ష్మీ,S.V.రంగారావు.

:::: 

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు
రాజభూషణ రజోరాజి నడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు
నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
ఎవ్వాని గుణలత లేడువారాశుల
కడపటి కొండపై గలయ బ్రాకు
నతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు

ఎవ్వాని వాకిట..ఎవరి వాకిట్లో..ఇభ..ఏనుగుల..మద..మద ధారల చేత ఏర్పడిన
పంకంబు - బురద, రాజ భూషణ - రాజులు వేసుకున్న ఆభరణాల, 
రజము - ధూళి, రాజి- గుట్ట , అడగు - అణగు (అణిగిపోతుందో)
ఎవ్వాని చారిత్రము - ఎవరి చరిత్ర అయితే, ఎల్ల లోకములకు, ఒజ్జయై 
గురువై, వినయంబు - వినయముయొక్క, ఒఱపు
గొప్పదనుము లేదా పద్ధతి, కఱపు - నేర్పు (నేర్పుతుందో)
ఎవ్వని కడకంట - ఎవరి కను తుదల, నివ్వటిల్లెడు
వ్యాపించే , చూడ్కి - చూపు, మానిత - కొనియాడబడిన
సంపదలు- సంపదలు, ఈను చుండు - ప్రసాదించును (ప్రసాదిస్తూ ఉంటుందో)
ఎవ్వాని గుణలతలు - ఎవరి గుణములనే లతలు, ఏడు వారాశుల 
సప్త సముద్రాల, కడపటి కొండపై - అవతల ఉన్న కొండపై, కలయన్ ప్రాకు అంతటా ప్రాకుతున్నాయో
అతడు - ధర్మరాజు, భూరి ప్రతాప - అధికమైన ప్రతాపం అనే, మహా ప్రదీప - గొప్ప జ్యోతి చేత, దూర విఘటిత - దూరాలకి కొట్టివేయబడ్డ, గర్వాంధకార - గర్వమనే చీకటి గల, వైరి వీర - శత్రు వీరుల యొక్క, కోటీర - కిరీటములందు ఉన్న, మణి ఘృణి - మణుల యొక్క కాంతి, వేష్టిత - చుట్టబడిన, అంఘ్రితలుడు - పాదములు కలిగినవాడు
కేవల మర్త్యుడే - సాధారణమైన మనిషా ఇతను? ధర్మ సుతుడు - యమ ధర్మరాజుకు కొడుకైన యుధిష్టిరుడు.
ధర్మరాజు వాకిట ఎందరెందరో రాజులు ఏనుగులమీద వస్తారు. ఆ ఏనుగులనుంచి కారే మద ధారల వల్ల అక్కడంతా బురద బురదగా మారుతోంది. రాజులు ధరించినవన్నీ రత్నాభరణాలు. వాళ్ళేమో కిక్కిరిసి ఉన్నారు. ఆ రాపిడికి ఆ రత్నాలు ఒరుసుకొని రత్న ధూళి కిందంతా పడుతోంది. ఆ ధూళిరాశులు కిందనున్న బురదని పోగొడుతున్నాయి.
ఎవని చరిత్ర గురువై వినయముయొక్క పద్ధతినీ గొప్పతనాన్నీ లోకమంతటికీ నేర్పుతుందో
ఎవని కడకంటి చూపు గొప్ప సంపదలు ప్రసాదిస్తుందో
ఇక్కడ గుణములు లతలు కాబట్టి అవి ప్రాకుతాయి. ఎక్కడికి? సప్తసముద్రాల అవతలున్న కొండమీదకి. అంటే ఎవని గుణములు లోకమంతా అంతగా ప్రసిద్ధి పొందాయో అని.
అతనెవరు? తన అమోఘప్రతాపము అనే మహాజ్యోతి చేత శత్రు రాజుల గర్వమనే అంధకారం దూరమైపోయింది. అలా గర్వం తొలగింపబడిన ఆ రాజులు ఇతని కాళ్ళకి నిరంతరం మ్రొక్కుతూ ఉన్నారు. దానితో వాళ్ళ కిరీటాలలో ఉండే మణుల కాంతి ఎల్లెప్పుడూ అతని పాదాలని చుట్టుకొని ఉంది.
ఇక్కడ ధర్మరాజు సామాన్య మనిషా... కాదు. స్వయానా యమధర్మ రాజు కొడుకు అని అర్థం. అంటే ధర్మానికి ప్రతీకే ధర్మరాజు అని చెప్పడమే.
ఇది తిక్కనగారి పద్యము. ఈ మాట ద్రౌపది భీమార్జునలతో అంటుంది. నర్తనసాల సినిమాలో మాత్రము అర్జునుడు(బృహన్నల) ద్రౌపది, భీముడితో ధర్మరాజు గురించి చెప్పిన పద్యము.

Saturday, July 25, 2015

తెనాలి రామకృష్ణ--1956



సంగీతం::M.S.విశ్వనాథన్-రామమూర్తి 
రచన::సముద్రాల రాఘవాచార్య(సీనియర్) 
గానం:::ఘంటసాల 
తారాగణం::అక్కినేని,N.T.రామారావు,P.భానుమతి,జమున,నాగయ్య,సంధ్య. 

పల్లవి: 

చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఆ ఆ ఆ ఈ కోటలో.. 
చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో.. 
చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో.. 
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ.. నీ మాట దక్కించుకో బాబయ 
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ.. నీ మాట దక్కించుకో బాబయా.. 
బాబయ... చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో.. 

చరణం 1: 

నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ... 
కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా... 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ... 
కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా ... 
ఇక కాయాలి బంగారు కాయలు... భోంచేయ్యాలి మీ పిల్లకాయలు 
కాయాలి బంగారు కాయలు... భోంచేయ్యాలి మీ పిల్లకాయలు 
చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా ...వేసేయ్యి పాగా ఈ కోటలో 

చరణం 2: 

రహదారి వెంట మొక్కనాటి పెంచరా 
కలవాడు లేనివాడు నిన్ను తలచురా 
రహదారి వెంట మొక్కనాటి పెంచరా 
కలవాడు లేనివాడు నిన్ను తలచురా 

భువిని తరతరాల నీదు పేరు నిలుచురా 
పనిచేయువాడే ఫలములారగింతురా 

చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా... వేసేయ్యి పాగా ఈ కోటలో 
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ... నీ మాట దక్కించుకో బాబయా 
బాబయా చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా... వేసేయ్యి పాగా ఈ కోటలో

Sunday, July 05, 2015

బాటసారి--1961



సంగీతం::మాష్టర్ వేణు
రచన::సముద్రాల సీనియర్
గానం::P.భానుమతి 
భరణీ వారి

దర్శకత్వం::రామకృష్ణ
తారాగణం::అక్కినేని,P.భానుమతి,జానకి,రమణమూర్తి,సూర్యకాంతం,ఛాయాదేవి,దేవిక

పల్లవి::

ఉపకార చింతే నేరమా కరుణే నిషేదమా
ఉపకార చింతే నేరమా కరుణే నిషేదమా
నిలాపనిందలే..ఈ లోక నైజమా
న్యాయమే..కానగజాలరా

కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు

చరణం::1

పాముల కన్నులతో కనేరా పరుల
పాలను పోసిన చేతినే కరచేరా
నీడనొసంగిన వారికే కీడు చేసేరా
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు

చరణం::2

నా మనసు నడత ఎరిగినవారే అపవాదు వేసినా
నమ్మేరా పెదవారు నా మాట
న్యాయమే..కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు

Tuesday, April 07, 2015

పల్నాటి యుద్ధం--1947



సంగీతం::గాలిపెంచల నరసిహ్మరావు  
రచన::సముద్రలరాఘవాచార్య(సీనియర్)
గానం::అక్కినేని,S.వరలక్ష్మీ
తారాగణం::అక్కినేని,ఎస్.వరలక్ష్మి,గోవిందరాజుల సుబ్బారావు,కన్నాంబ,వంగర,సురభి బాలసరస్వతి,ముదిగొండలింగమూర్తి

పల్లవి::

ఓహో చారుశీలా
ఓహోహోహో వీరబాలా
ఓహో చారుశీలా
ఓహోహోహో వీరబాలా
విరాళి తీరువవే నా వరాల జవరాలా
విరాళి తీరువవే నా వరాల జవరాలా
ఓహో చారుశీలా

చరణం::1

చలము బలము సాహసము
విరాళీకొరకేనా 
చలము బలము సాహసము
విరాళీకొరకేనా
సుమశరాళి కలగెదరా 
సుమశరాళి కలగెదరా
అరిజనాళి నగరా సైరించెదరా
జనాళి నగరా సైరించెదరా
ఓహోహో బాలవీరా
రణధీరా విజితమారా
రణధీరా విజితమారా

చరణం::2

నవయవ్వన ఫల భాగ్యము 
లేని జీవనమేలా ప్రియులారా
నవయవ్వన ఫల భాగ్యము 
లేని జీవనమేలా ప్రియులారా
కలతతీరా వలపుమీరా
కలతతీరా వలపుమీరా
చేరరావే మాంచాలా
చేరరావే మాంచాలా
ఓహోహో చారుశీలా

చరణం::3

నీయూరుపులో గాలినై
నీదు సిగలో తారనై
నీయూరుపులో గాలినై
నీదు సిగలో తారనై
నీ నీడనుగా నే లేనా
నీయడుగులలో నే రానా
నీయడుగులలో నే రానా
ఓహోహో చంద్రబాలా
ఓహోహో చారుశోలా
ఓహోహో చంద్రబాలా
ఓహోహో చారుశోలా

Palnaati Yuddham--1947
Music::Galipenchala Narasimha Rao
Lyricis::SamudralaRaghavacharya (Senior)
Singer's::Akkineni ,S.VaraLakshimi
Cast::Akkineni,S.Varalakshmii,Govindarajula Subbaaraavu,Kannaamba,Vangara,S.balasaraswati,mudikonDa lingamoorti.

::::

OhO chAruSIlA
OhOhOhO vIrabAlA
OhO chAruSIlA
OhOhOhO vIrabAlA
virALi tIruvavE 
nA varAla javarAlA
virALi tIruvavE 
nA varAla javarAlA
OhO chAruSIlA

::::1

chalamu balamu sAhasamu
virALIkorakEnA 
chalamu balamu sAhasamu
virALIkorakEnA
sumaSarALi kalagedarA 
sumaSarALi kalagedarA
arijanALi nagarA sairiMchedarA
janALi nagarA sairiMchedarA
OhOhO bAlavIrA
raNadhIrA vijitamArA
OhOhO bAlavIrA
raNadhIrA vijitamArA

::::2

navayavvana Pala BAgyamu 
lEni jIvanamElA priyulArA
navayavvana Pala BAgyamu 
lEni jIvanamElA priyulArA
kalatatIrA valapumIrA
kalatatIrA valapumIrA
chErarAvE mAMchAlA
chErarAvE mAMchAlA
OhOhO chAruSIlA

::::3

nIyUrupulO gAlinai
nIdu sigalO tAranai
nIyUrupulO gAlinai
nIdu sigalO tAranai
nI nIDanugA nE lEnA
nIyaDugulalO nE rAnA
nIyaDugulalO nE rAnA
OhOhO chaMdrabAlA
OhOhO chAruSOlA
OhOhO chaMdrabAlA
OhOhO chAruSOlA

Sunday, March 22, 2015

వీరాభిమన్యు--1965




సంగీతం::K.V.మహదేవన్
రచన::సముద్రాల సీనియర్ (senior)
గానం::S.జానకి,బృందం
Film Directed By::V.Madhusoodhana Rao 
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,శోభన్‌బాబు,కాంచన,S.వరలక్ష్మి,G.వరలక్ష్మి

పల్లవి::

కల్లా కపటం రూపై వచ్చే నల్లని వాడా రా 
చల్లానమ్మే పిల్లల వెదకే అల్లరి వాడా రా 
కల్లా కపటం రూపై వచ్చే నల్లని వాడా రా 
చల్లానమ్మే పిల్లల వెదకే అల్లరి వాడా రా 
నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా
నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా

చరణం::1

ద్వారక వీడి నీరధి లోనా దాగిన వీరా రా 
చెఱలో పుట్టీ చెఱలో పెరిగిన మాయలమారీ రా 
ద్వారక వీడి నీరధి లోనా దాగిన వీరా రా 
చెఱలో పుట్టీ చెఱలో పెరిగిన మాయలమారీ రా
గొర్రెలు బర్రెలు మేపే వానికి రాజ్యము ఏలయ్యా
అవనీ పాలన అతివలతోటీ ఆటలు కాదయ్యా 
గొర్రెలు బర్రెలు మేపే వానికి రాజ్యము ఏలయ్యా
అవనీ పాలన అతివలతోటీ ఆటలు కాదయ్యా 

నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా
నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా

చరణం::2

అష్టమి పుట్టినవాడా ముదిపామును కొట్టిన వాడా 
అష్టమి పుట్టినవాడా ముదిపామును కొట్టిన వాడా 
మద్దుల గూల్చిన వాడా ముసలెద్దుని చంపిన వాడా
కొంటె కృష్ణా రారా గోపీ కృష్ణా రా రా అనాథ కృష్ణా 
కృష్ణా రా కృష్ణా రా రారారా 
కన్నెల దొంగ వెన్నల దొంగ దారుల దొంగ చీరల దొంగా 
అల్లరి కృష్ణా అల్లరి కృష్ణా అల్లరి కృష్ణా అల్లరి కృష్ణా 

కల్లాకపటం కానరాని చల్లని స్వామీ రా 
ఎల్లరికీ సుఖము గోరు నల్లని స్వామీ రా
కల్లాకపటం కానరాని చల్లని స్వామీ రా 
ఎల్లరికీ సుఖము గోరు నల్లని స్వామీ రా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా

చరణం::3

వైరినైన కరుణనేలు పరమాత్మా రా 
సభలో ద్రౌపదిని దయగనిన ప్రభూరా 
వైరినైన కరుణనేలు పరమాత్మా రా 
సభలో ద్రౌపదిని దయగనిన ప్రభూరా 

చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా

భ్రమతో నిను గోరే మా కనుల పొరలు తొలగే
భ్రమతో నిను గోరే మా కనుల పొరలు తొలగే
నిందజేయు నోటితోనే పొగడజేతు మీ మహిమ 
నిందజేయు నోటితోనే పొగడజేతు మీ మహిమ 
భ్రమతో నిను గోరే మా కనుల పొరలు తొలగే

చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా

కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా

Sunday, July 20, 2014

భక్త ప్రహ్లాద--1967::కరహరప్రియ::రాగం



సంగీతం::సాలూరి రాజేశ్వర్ రావు
రచన::సముద్రాల రాఘవాచార్య(సీనియర్ )
గానం::P.సుశీల
తారాగణం::S.V. రంగారావు,మంగళంపల్లి బాలమురళీ కృష్ణ,రేలంగి,పద్మనాభం,
హరనాధ్, అంజలీదేవి,జయంతి,బేబి రోజా రమణి
కరహరప్రియ::రాగం 

పల్లవి::

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవే కదా 

జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు 
సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ 

నిన్నేగానీ పరులనెఱుంగా..రావే వరదా
బ్రోవగ రావే..వరదా..వరదా
అని మొరలిడగా..కరి విభు గాచిన
అని మొరలిడగా..కరి విభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా

హే ప్రభో...హే ప్రభో
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
కరుణాభరణా..కమలలోచనా
కరుణాభరణా..కమలలోచనా
కన్నుల విందువు చేయగా రావే
కన్నుల విందువు చేయగా రావే
ఆశృత భవ బంధ నిర్మూలనా
ఆశృత భవ బంధ నిర్మూలనా
లక్ష్మీ వల్లభా..లక్ష్మీ వల్లభా

Sunday, June 08, 2014

శ్రీకృష్ణావతారం --1967



సంగీతం::T.V.రాజు
రచన::సముద్రాల 
గానం::P.సుశీల
Film Directed By::K.Kameswara Rao 
తారాగణం::N.T.రామారావు,శోభన్‌బాబు,ముక్కామల,సత్యనారాయణ,నాగయ్య,దేవిక,కాంచన

పల్లవి::

ఏమేమో అవుతుంది ఎగిసి ఎగిసి పోతుంది
ఏమేమో అవుతుంది ఎగిసి ఎగిసి పోతుంది
రేలుపవలు తెలియని నా మనసు..ఊఊఊ 
రేకులు విప్పిన తొలి వయసు..ఊఊఊ
రేకులు విప్పిన తొలి వయసు..ఊ

ఏమేమో అవుతుంది ఎగిసి ఎగిసి పోతుంది
రేలుపవలు తెలియని నా మనసు..ఊఊఊ 
రేకులు విప్పిన తొలి వయసు..ఊఊఊ
రేకులు విప్పిన తొలి వయసు..ఊ

చరణం::1

పువ్వులు..మువ్వలు..ఊ
పువ్వలు పులకరించి..నవ్వులొలుకుతున్నవి
మువ్వలు పరవశించి..సవ్వడి చేస్తున్నవి..ఈఈఈ 
సవ్వడి..చేస్తున్నవి..ఈ

ఏమేమో అవుతుంది ఎగిసి ఎగిసి పోతుంది
రేలుపవలు తెలియని నా మనసు..ఊఊఊ 
రేకులు విప్పిన తొలి వయసు..ఊఊఊ
రేకులు విప్పిన తొలి వయసు..ఊ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

చరణం::2 

నీలాల మబ్బు తునక నేలకు దిగి వచ్చెనా
నీలాల మబ్బు తునక నేలకు దిగి వచ్చెనా
నీలాల మబ్బు తునక నేలకు దిగి వచ్చెనా
ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా..ఆఆఆ  
ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా..ఆఆఆ
ముంగిటనే..ఏఏఏ..నిలిచెనా..ఆఆఆ 

Krishnavataaram-1967
Music::T.V.Raju
Lyrics::Samudrala
Singer's::P.Suseela
Film Directed By::K.Kameswara Rao
Cast::N.T.RamaRao,Sobhanbabu,Mukkaamala,Satyanarayana,Devika,Kanchana.

::::::::::::::::::::::::::::

EmEmO avutundi egisi egisi pOtundi
EmEmO avutundi egisi egisi pOtundi
rElupavalu teliyani naa manasu..uuuuuu 
rEkulu vippina toli vayasu..uuuuuu
rEkulu vippina toli vayasu..uu

EmEmO avutundi egisi egisi pOtundi
rElupavalu teliyani naa manasu..uuuuuu 
rEkulu vippina toli vayasu..uuuuuu
rEkulu vippina toli vayasu..uu

::::1

puvvulu..muvvalu..uu
puvvalu pulakarinchi..navvulolukutunnavi
muvvalu paravaSinchi..savvaDi chEstunnavi..iiiiii 
savvaDi..chEstunnavi..ii

EmEmO avutundi egisi egisi pOtundi
rElupavalu teliyani naa manasu..uuuuuu 
rEkulu vippina toli vayasu..uuuuuu
rEkulu vippina toli vayasu..uu
aa aa aa aa aa aa aa aa aa aa aa 

::::2 

neelaala mabbu tunaka nElaku digi vachchenaa
neelaala mabbu tunaka nElaku digi vachchenaa
neelaala mabbu tunaka nElaku digi vachchenaa
mutyaala chandamaama mungiTanE nilichenaa..aaaaaaaa  
mutyaala chandamaama mungiTanE nilichenaa..aaaaaaaa
mungiTanE..EEE..nilichenaa..aaaaaaaa 

Saturday, November 16, 2013

లవకుశ--1963::కల్యాణి::రాగం



సంగీతం:: ఘంటసాల
రచన::సముద్రాల సీనియర్           
గానం::S.జానకి, బృందం 
కల్యాణి::రాగం

పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
విరిసే చల్లనీ వెన్నెలా
విరిసే చల్లనీ వెన్నెలా
మరల ఈనాడు మా కన్నులా
విరిసే చల్లనీ వెన్నెలా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం::1

చెన్నుమీర జానకమ్మ
అంకమ్మున వామాంకమ్మున
మా కన్నుదోయి విందుచేసి
మా రాముడు కరుణాధాముడు
చెన్నుమీర జానకమ్మ
అంకమ్మున వామాంకమ్మున
మా కన్నుదోయి విందుచేసి
మా రాముడు కరుణాధాముడు

మదినెన్నో వింత సంబరాలు చేయగా
విరిసే చల్లనీ వెన్నెలా
మరల ఈనాడు మా కన్నులా
విరిసే చల్లనీ వెన్నెలా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం::2

మరువగరానీ పండుగ నేడు
మా పాలికీ సర్వ జీవాళికి
మా ఊరూనాడూ వెల్లి విరిసే
ఉల్లాసము మధురోల్లాసము
మరువగరానీ పండుగ నేడు
మా పాలికీ సర్వ జీవాళికి
మా ఊరూనాడూ వెల్లి విరిసే
ఉల్లాసము మధురోల్లాసము
ధర పొంగీపోయీ ఆటలాడే హాయిగా

విరిసే చల్లనీ వెన్నెలా
మరల ఈనాడు మా కన్నులా
విరిసే చల్లనీ వెన్నెలా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


Lava-Kusa--1963
Music::Ghantasala
Lyrics::Samudraala
Singer's::S.Janaki, & Brundam
Kalyaani::raagam :::

virise challani vennelaa
virise challani vennelaa
marala eenaadu maa kannulaa
virise challani vennelaa 
aa aa aa aa aa

:::1

chennumeera jaanakamma
amkammuna vaamaamkammuna
maa kannudoyi vimduchesi
maa raamudu karunaadhaamudu
chennumeera jaanakamma
amkammuna vaamaamkammuna
maa kannudoyi vimduchesi
maa raamudu karunaadhaamudu

madinenno vimta sambaraalu cheyagaa
virise challani vennelaa
marala eenaadu maa kannulaa
virise challani vennelaa 
aa aa aa aa aa


:::2

maruvagaraanee pamduga nedu
maa paalikee sarva jeevaaliki
maa ooroonaadoo velli virise
ullaasamu madhurollaasamu
maruvagaraanee pamduga nedu
maa paalikee sarva jeevaaliki
maa ooroonaadoo velli virise
ullaasamu madhurollaasamu
dhara pomgeepoyee aatalaade haayigaa

virise challani vennelaa
marala eenaadu maa kannulaa
virise challani vennelaa 
aa aa aa aa aa

Sunday, June 02, 2013

ఓ సీత కథ--1974


సంగీతం::K.V.మహాదేవన్
రచన::సముద్రల రాఘవాచార్య(సీనియర్) 
గానం::S.P.బాలు 
తారాగణం::చంద్రమోహన్,కాంతారావు,అల్లు రామలింగయ్య,రోజారమణి,శుభ,రమాప్రభ

పల్లవి::

చింత చిగురు పులుపనీ
చీకటంటే నలుపనీ 
చెప్పందే తెలియనీ చిన్నపిల్ల..అది
చెఱువులో పెరుగుతున్న చేపపిల్ల 
అభం శుభం తెలియని పిచ్చిపిల్ల       
చింత చిగురు పులుపనీ
చీకటంటే నలుపనీ చెప్పందే 
తెలియనీ చిన్నపిల్ల..అది
చెఱువులో పెరుగుతున్న చేపపిల్ల 
అభం శుభం తెలియని పిచ్చిపిల్ల       

చరణం::1

గట్టుమీద కొంగను చూసి
చెట్టుమీద డేగను చూసి 
చుట్టమని అనుకుంది 
చేప పిల్ల పాపం చేపపిల్ల  
గట్టుమీద కొంగను చూసి
చెట్టుమీద డేగను చూసి 
చుట్టమని అనుకుంది 
చేప పిల్ల పాపం చేపపిల్ల
చెంగు చెంగున చెరువు దాటి చెంత నిలిచి
చేయి చాచి చెలిమిచేయ పిలిచింది..చేప పిల్ల 
అభం శుభం తెలియని పిచ్చిపిల్లా           
చింత చిగురు పులుపనీ
చీకటంటే నలుపనీ చెప్పందే 
తెలియనీ చిన్నపిల్ల..అది
చెఱువులో పెరుగుతున్న చేపపిల్ల 
అభం శుభం తెలియని పిచ్చిపిల్ల

చరణం::2

చింత చిగురు పులుపనీ
చీకటంటే నలుపనీ చెప్పందే 
తెలియనీ చిన్నపిల్ల..అది
చెఱువులో పెరుగుతున్న చేపపిల్ల 
అభం శుభం తెలియని పిచ్చిపిల్ల
ఎరవేసిన పిల్లవాడు ఎవరనుకుందో
ఎగిరివచ్చి పడ్డది ఆతని ఒడిలో
తుళ్ళి తుళ్ళి ఆడే చిలిపి చేపపిల్ల
తాళి లేని తల్లాయె అమ్మచెల్ల
నాన్నలేని పాపతో నవ్వేలోకంలో
ఎన్నాళ్ళు వేగేను చేపతల్లి
అభం శుభం తెలియని పిచ్చితల్లి
అభం శుభం తెలియని పిచ్చితల్లి

Monday, March 25, 2013

దొంగరాముడు--1955::శుద్ధసారంగ::రాగం





సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావ్  
రచన::సముద్రాల
గానం::P.సుశీల 
తారాగణం::నాగేశ్వర రావ్,సావిత్రీ.జగ్గయ్య,జమున.  
శుద్ధసారంగ::రాగం 

పల్లవి::

బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
బోసి నవ్వుల బాపూజీ
చిన్నీ పిలక బాపూజీ 

బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

చరణం::1

కుల మత భేదం వలదన్నాడు
కలిసి బతికితే బలమన్నాడు
మానవులంతా ఒకటన్నాడు
మనలో జీవం పోశాడు 

బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

చరణం::2

నడుము బిగించి లేచాడు
అడుగూ ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ
దేశం దేశం కదిలింది
గడ గడ లాడెను సామ్రాజ్యం
మనకు లభించెను స్వరాజ్యం 

బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

చరణం::3

సత్యాహింసలే శాంతి మార్గమని
జగతిని జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
మానవ ధర్మం బోధించాడు
మహాత్ముడై ఇల వెలిశాడు 

బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ

బలే తాత మన బాపూజీ
బాలల తాత బాపూజీ 

బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ 

బలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ   

Sunday, March 24, 2013

శ్రీకృష్ణ తులాభారం--1966














సంగీతం::పెండ్యాల
రచన::సముద్రల రాఘవాచార్య(సీనియర్) 
గానం::P.సుశీల

పల్లవి::

కొనుమిదే కుసుమాంజలి
అమరులా ప్రణయాంజలీ
కొనుమిదే కుసుమాంజలి
రసికా నటలోక సార్వభౌమ నాదలోల విజయగోపాల
కొనుమిదే కుసుమాంజలి

చరణం::1

కాళీయ ఫణిరాజు పడగలపైనా
కాలియందియలు ఘల్లుమనా
లీలా నాట్యము చేసి చూపినా
లీలా నాట్యము చేసి చూపినా
తాండవ కృష్ణా జోహార్ జోహార్

కొనుమిదే కుసుమాంజలి
అమరులా ప్రణయాంజలీ
కొనుమిదే కుసుమాంజలి

చరణం::2

నీ మధు మురళీ గానము విన్నా
భామలు మోహము మీరి దీనలై
నీ మధు మురళీ గానము విన్నా
భామలు మోహము మీరి దీనలై
రారా మదిని వగదీర మరులు నెరవేర
మనసు తనివార కౌగిలి వీర
నెరా దొరా మాపై నెనరు గొనర
మారుకేళి దేలుపు మను మగువల
మహానందమయ మలయోల్లాస గతులా
దివ్య రాస కేళి మహిమ జూపి మురియజేసి
నిదవధి సుఖమొసగిన ఘనశ్యామ
సత్యభామ పరంధామ

కొనుమిదే కుసుమాంజలీ
అమరులా ప్రణయాంజలీ
కొనుమిదే కుసుమాంజలీ 

Monday, July 23, 2012

సీతారామ కళ్యాణం--1961














సంగీతం::గాలిపెంచెల నరసింహారావు
రచన::సముద్రాల రాఘవాచార్య 
గానం::P.లీల
తారాగణం::N.T.రామారావు,B.సరోజాదేవి,గుమ్మడి,నాగయ్య,కాంతారావు,గీతాంజలి,హరనాధ్

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను
మురిపాలు వెలబోయు భామలలోన
మురిపాలు వెలబోయు భామలలోన

సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను

చరణం::1

బంగారు రంగారు మైజిగిలోన
బంగారు రంగారు మైజిగిలోన
పొంగారు వయసూ పొంకములోన
సంగీత నాట్యాల నెైపుణిలోన
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఅ 
సంగీత నాట్యాల నెైపుణిలోన
నా సాటి నెరజాణ కనరాదుగా

సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను

చరణం::2

మగువల నొల్లని మునియైనా..ఆ
మగువల నొల్లని మునియైనా
నా నగుమోమునుగన చేజాచడా
యాగము యోగము దానములన్నీ
యాగము యోగము దానములన్నీ
నా బిగికౌగిలి సుఖమునకేగా

సరసాల జవరాలను నేనేగదా
సరసాల జవరాలను

Tuesday, July 05, 2011

గృహలక్ష్మి--1967




సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్
రచన::సముద్రాలరాఘవాచార్య(సీనియర్)
గానం::P.భానుమతి

తారాగణం::అక్కినేని,P.భానుమతి,S.V.రంగారావు,పద్మనాభం,సూర్యకాంతం,రమణరెడ్డి.

పల్లవి::

లాలి లాలీ..గోపాలబాలా లాలి..లాలీ

పొద్దుపోయే నిదురించవయ్య ముద్దులయ్య
లాలి లాలీ..గోపాలబాలా లాలి..లాలీ
మేడ మీద బూచివాడు జాగుచేస్తే వచ్చేస్తాడు
జాలి తలచి పవళించవయ్య చల్లనయ్య
లాలి లాలీ..గోపాలబాలా లాలి..లాలీ

చరణం::1

బొజ్జనిండ పాలారగించి సెజ్జమీద బజ్జోవయ్య
బొజ్జనిండ పాలారగించి సెజ్జమీద బజ్జోవయ్య
వింతకధనే చెపుతా నీకు నీవు వింటే అంతే చాలు
కధకు మూలం నీవే కదయ్య చక్కనయ్య
లాలి లాలీ..గోపాలబాలా లాలి..లాలీ

చరణం::2

నిండుజాబిలి తారాడసాగే నీటకలువ నింగి చూసే
నిండుజాబిలి తారాడసాగే నీటకలువ నింగి చూసే
నీలమేఘం నడుమ నిలిచే నీకు నిదుర రానేరాదా
తెల్లవారే వేళాయెనయ్య నల్లనయ్య
లాలి లాలీ..గోపాలబాలా లాలి..లాలీ
పొద్దుపోయే నిదురించవయ్య ముద్దులయ్య
లాలి లాలీ..గోపాలబాలా లాలి..లాలీ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్