Saturday, February 07, 2009
ముగ్గురు అమ్మాయిల మొగుడు ~~1983
సంగీతం::KV.మహాదేవన్
రచన::?
గానం::P.సుశీల
ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో
ఆ..ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో
కన్నె మొగ్గలు ఎన్నెన్నో ముంగిట ముగ్గుల్లో
ముంగిట ముగ్గుల్లో...
ఆ..ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో..
స్నానాల సందడిలో సన్నాపొద్దు పోడిచి
చీరకట్టి కురులపైన కన్నే పొద్దుగడిచే
ఆ..స్నానాల సందడిలో సన్నాపొద్దు పోడిచి
చీరకట్టి కురులపైన కన్నే పొద్దుగడిచే
రాగం ఒకటి అందుకొని..పని పాటల పడితే
అంతలేసి ఎండపొద్దు వెన్నెల్లై నడిచే..
ఆ..ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో
కన్నె మొగ్గలు ఎన్నెన్నో ముంగిట ముగ్గుల్లో
ముంగిట ముగ్గుల్లో...
ఆ..ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో..
మునిమాపున సేదతీరి చెలియాలంత కలిసి
కూర్చుతున్న పూవులతో నవ్వుల్లో కలబోసి..
మునిమాపున సేదతీరి చెలియాలంత కలిసి
కూర్చుతున్న పూవులతో నవ్వుల్లో కలబోసి..
ఊరు పేరు లేని వరుడి ఊసులాడుతు వుంటే
ఆదమరచి కన్నె పడుచు కలలలోకి జారే
ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో
ఆ..ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో
కన్నె మొగ్గలు ఎన్నెన్నో ముంగిట ముగ్గుల్లో
ముంగిట ముగ్గుల్లో...
ఆ..ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో..
Labels:
P.Suseela,
ముగ్గురు అమ్మాయిల మొగుడు -1983
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment