Monday, February 23, 2009

!! మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు !!

!! ఓమ్ నమః శివాయ !! ఓమ్ నమః శివాయ !!


మాఘ బహుళ చతుర్ధశి
మాఘమాసంలో బహుళ చతుర్ధశిని "మహా శివరాత్రి" అంటారు.
(తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు - రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి)

మహా శివరాత్రి మానవులందరకు పర్వదినము - అనగా గొప్ప పండుగ.
చలి కాలం వెళ్ళబోతుండగా 'మహాశివరాత్రి' పండుగ దినము వస్తుంది.
శివక్షేత్రములందు 'శివరాత్రి'ని పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవముగా చాలా గొప్పగా జరుపుతారు


తెలిసిగానీ తెలియక గానీ భక్తి తోగాని డంబముతో గాని
యీరోజు ఎవరైతే స్నానము దానము ఉపవాసము జాగరణ చేస్తారో
వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.

No comments: