సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::SP.బాలుP.సుశీల
సింధుభైరవి::రాగం
మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా..పిల్లదాని వాలుకన్నులా
మల్లెపూలు జల్లె ఎన్నెలా..పిల్లదాని వాలుకన్నులా..ఓహో.ఓ.ఓ.ఓ
మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా..ఎన్నెలమ్మ ఎండికన్నులా
మల్లెపూలు జల్లె ఎన్నెలా..ఎన్నెలమ్మ ఎండికన్నులా
ఓహో..ఓ..ఓ..ఓ..ఓ
ఎలుతురు తోటలో మినుగురు పాటలా
వెలుతురు వేణు వూదనే..ఎన్నెలా
కిన్నెర వీణ మీటెనే..
ఎలుతురు తోటలో మినుగురు పాటలా
వెలుతురు వేణు వూదనే..ఎన్నెలా
కిన్నెర వీణ మీటెనే..
ఆ నిద్దరమ్మ ముద్దరేసే కలల అలల వెల్లువలో
మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా
ఎన్నెలమ్మ ఎండికన్నులా
ఆహా..ఆ ఆ ఆ ఆ ఆ
వణికిన పెదవులా..తొణికిన మధువుల
పొగడలు పొన్నలాయేనే ఎన్నెలా మనుగడ మీగడాయెనే
వణికిన పెదవులా..తొణికిన మధువుల
పొగడలు పొన్నలాయేనే ఎన్నెలా మనుగడ మీగడాయెనే
హాయ్..ఇద్దరైన ముద్దులమ్మ వలపు వలన అల్లికలో
మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా
ఎన్నెలమ్మ ఎండికన్నులా
మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా..పిల్లదాని వాలుకన్నులా
ఓహో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
No comments:
Post a Comment