Sunday, February 15, 2009

స్వయం కృషి--1987

సంగీతం::రమేష్ నైడు
రచన::వేటూరి
గానం::S.జానకి

సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ ఆ ఆ ఆ
అన్నులమిన్న అలవేలుమంగ ఆతని సన్నిధి కొలువుంట
సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ

ఎరిగిన మనసుకు ఎరలేలే
ఏలిక సెలవిక శరణేలే
ఎరిగిన మనసుకు ఎరలేలే
ఏలిక సెలవిక శరణేలే
ఎవరికి తెలియని కధలివిలే
ఎవరికి తెలియని కధలివిలే
ఎవరో చెప్పగా ఇక లేలే
సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ
అన్నులమిన్న అలవేలుమంగ ఆతని సన్నిధి కొలువుంట

నెలత తలపులే నలుగులుగా
కలికి కనులతో జలకాలు ఉ ఉ ఉ
నెలత తలపులే నలుగులుగా
కలికి కనులతో జలకాలు
సందిటనేసిన చెలువములే
సందిటనేసిన చెలువములే
సుందరమూర్తికి చేలములు ఆ ఆ ఆ అ
సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ
అన్నులమిన్న అలవేలుమంగ ఆతని సన్నిధి కొలువుంట

కలల ఒరుపులే కస్తురిగా
వలపు వందనపు తిలకాలు ఉ ఉ ఉ
వలపు వందనపు తిలకాలు
అంకము చేరిన పొంకాలే
అంకము చేరిన పొంకాలే
శ్రీవేంకటపతికిక వేడుకలు ఉహు ఉహు ఉ

No comments: