సంగీతం::గాలి పెంచల నరసింహారావు
రచన::సముద్రాల రాఘవాచార్యులు
గానం::ఘంటసాల
ఆరభి :::రాగం
హే పార్వతీనాథ కైలాస శైలాగ్రవాసా
శశాంకార్థ మౌళీ ఉమా దేవతోల్లాసి తవ్యాంగభాగా
శ్రితానందదాయి స్మితాపాంగా
భస్మీకృతానంద గంగాధరా
సర్వసంతాప హరా హరా
శివా సదాశివా -
మాయామాళవగౌళ::రాగం
నీయున్న చందంబు నేనెంత
యూహింపగా వచ్చు - వేదమ్ములున్నీవ వాదమ్ములున్నీవ
ధైర్యంబులున్నీవ మర్మంబులున్నీవ
సర్వంబులున్నీవ - నీ లెంకలైనట్టి దాసుండనైనట్టి
నన్నుం దయాళుండవై ప్రీతి రక్షింపవే
తప్పు సైరింపవే దేవ మన్నింపవే - దేవదేవా మహాదేవా
నమస్తే నమస్తే నమః
2 comments:
రెండవ పంక్తిలో "శశాంకార్థ మౌళీ ఉమా దేవతోల్లాసి తవ్యాంగభాగా" అని వుండాలి.
నమస్తే సూర్యనారాయణ గారు __/\__
మీ పుణ్యామా అంటు నా బ్లాగు తప్పులు
లేకుండగా వెలిగి పోతున్నది కొంచం కొంచం గా
చాలా కృతజ్ఞతలు మీకు
Post a Comment