Friday, February 20, 2009

కళా తపస్వి శ్రీ కే .విశ్వనాధ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు



కళా తపస్వి శ్రీ కే .విశ్వనాధ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
విశ్వనాథ్ గారు తీసిన సినిమాల్లో నాకు నచ్చినవి


జీవనజ్యోతి
సిరిసిరిమువ్వ
సూత్రధారులు
సీతామాలక్ష్మి
ఆత్మగౌరవం
సుడిగుండాలు
శుభసంకల్పం
శుభోదయం
స్వయంకృషి
స్వాతిముత్యం
స్వాతికిరణం
సాగరసంగమం
శంకరాభరణం
సిరివెన్నెల
స్వర్ణకమలం
సప్తపది
వీటిలోని పాటలు కొన్ని ఇక్కడ వేస్తున్నాను
!!సిరి సిరి మువ్వ!!
::: రాగం::రేవతి :::
రచన::వేటూరి సుందరరామ మూర్తి
గానం:::యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పీ.సుశీల
సంగీత దర్శకత్వం::కే.వీ.మహదేవన్
దర్శకత్వం::కాశినాధుని విశ్వనాథ్

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా

యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
చలిత లలిత పద కలిత కవిత లెగ
సరిగమ పలికించగా
స్వర మధురిమ లొలికించగా
సిరిసిరి మువ్వలు పులకించగా

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం!!

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
ఆకాశమై పొంగే ఆవేశం
కైలాశమే వంగే నీకోసం

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం!!

మెరుపుంది నాలో - అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో - అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం!!

*******************************************
సినిమా:::స్వర్ణకమలం
సంగీతం::ఇళయరాజా
గానం:యస్.జానకి,S.బాలూ
సాకీ:
కంఠేన లంబయే గీతం
హస్తేన అర్ధం ప్రదర్షయేత్
చక్షుభ్యాం దర్శయేత్ భావం
పాదాభ్యాం తాళం ఆచరేత్

కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే
వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే

పలుపొంకమగు చిలువలకంకణములమర
నలువంకల మణిరు చులవంక కనరా
పలుపొంకమగు చిలువలకంకణములమర
నలువంకల మణిరు చులవంక కనరా
పలుపొంకమగు చిలువలకంకనములమర
నలువంకల మణిరు చులవంక కనరా

తలవంక నలవేలు
తలవంక నలవేలు
కులవంక నెలవంక
తలవంక నలవేలు
కులవంక నెలవంక
వలచేత నొసగింక వైఖరి మీరంగ

మేలుగరతనంబు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయు రాలు నెరయంగ
మేలుగరంతనంబు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కెయు రాలు నెరయంగ
పాలు గారు మోమున శ్రీను పొడమా
పాలు గారు మోమున శ్రీను పొడమా
పులి తోలు గట్టి ముమ్మోన వాలు బట్టి తెరగా

*******************************



!! స్వాతి కిరణం !!
రచన: ?
సంగీతం::KV.మహదేవన్
గానం::వాణీ జయిరాం

రాగం::అమౄతవర్షిణి :::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొర సన్నిధి చేరగా
ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా
ఆనతి నీయరా హరా ఆ ఆ ఆ

నీ ఆన లేనిదే రచింప జాలున వేదాల వాణితో విరించి విశ్వ నాటకం
నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయతో మురారి దివ్య పాలనం
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివ
ఆనతి నీయరా హరా ఆ ఆ ఆ
ని నీ స ని ప నీ ప మ గ స గా
ఆనతి నీయరా
అచలనాధ అర్చింతును రా
ఆనతి నీయరా
పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస గమసని
ఆనతి నీయరా

జంగమ దేవర సేవలు గొనరా
మంగళదాయక దీవెనలిడరా
శాష్టంగము గా దండము చేతురా
ఆనతి నీయరా
సానిప గమపనిపమ గమగ పప పప
మపని పప పప గగమ గస సస
నిగస సస సస సగ గస గప పమ పస నిస
గసని సగ సగ సని సగ సగ
పగ గగ గగ సని సగ గ
గసగ గ పద గస గ మ స ని పమగ గ
ఆనతి నీయరా

శంకర శంకించకురా
వంక జాబిలిని జడను ముడుచుకొని
విషపు నాగులను చంకనెత్తుకొని
నిలకడ నెరుగని గంగనేలి ఏ వంకలేని నావంకనొక్క
కడగంటి చూపు పడనీయవేని నీ కిన్కరునిక సేవించుకొందురా
ఆనతి నీయరా
పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గగ
గమపని గ మపనిస మ పనిసగ ని స ప ని మ పా గా మా స
పప పమప నినిపమగస గగ
గమపని గా మపనిస మా పనిసగ ని స ప ని మ ప మ గ స గా మ
పప పమప నినిపమగస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ స గ మ
పప పమప నినిపమగస గగా
గామపని గమాపాని స మపానిసగని
స పని మ ప గ మ స గ మ
పప పమప నినిపమగస గ గా గా
గగ మామ పప నిగ తక తకిట తకదిమి
మమ పప నినిసమ తక తకిట తకదిమి
పపనినిసస గని తక తకిట తకదిమి
సపని మప గమ సగమ
పప పమప నినిపమగస గ గా
రక్షా ధర శిక్షా దీక్ష ద్రాక్ష
విరూపక్ష నీ కృపావీక్షణాపేక్షత ప్రతీక్షణుపేక్ష చేయక
పరీక్ష చేయక రక్ష రక్ష అను ప్రార్ధన వినరా

ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా
దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ....
*****************************************


ఫిల్మ్!! స్వర్ణ కమలం !!
రచన::సిరివెన్నెల
సంగీతం::ఇళయరాజా
గానం::జానకి


ఆ ఆ ఆఆ ఆఆ
ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచీ కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు

మబ్బులో తూలుతున్న మెరుపైపోనా
వయ్యారి వానజల్లై దిగిరానా
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
సందెల్లో రంగులెన్నో చిలికైనా
పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా
నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచీ కలకాలం ఉండిపోనా

స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలీనే సోయగాన చందమామ మందిరాన
నాకోసం సురభోగాలే వేచి నిలిచెనుగా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచీ కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు

********************************


ఫిల్మ్!! స్వాతి ముత్యం !!
రచన:సి.నారాయణ రెడ్డి
సంగీతం::ఇళయరాజా
గానం::బాలు,జానకి
రాగం::మధ్యమావతి

ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ
చాల బాగా పాడుతున్నారు
ఆ పైశడ్యం ఆ మండలం ఆ ఆ ఆ
చూడండి ఆ ఆ ఆ ఆ హా ఆఆఆ ఆఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిసరిమ పనిసరి నిరిదాస నిపమపని సా నిపరిమరి నీస
తా నననా తనాన తదరి నా ఆ

సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఉహు
గువ్వ మువ్వ సవ్వాడల్లె నవ్వాలమ్మ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఉహు
గువ్వ మువ్వ సవ్వాడల్లె నవ్వాలమా
హ హా ఆ అ ఆ అ ఆ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
సువ్వి సువ్వి సువ్వీ
సువ్వి సువ్వి సువ్వీ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ

ఓహో ఓహో ఓహో ఓ ఓ
అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండెలేని మనిషల్లే నిన్ను కొండ కోనల కొదిలేసాడ
గుండెలేని మనిషల్లే...
గుండెలేని మనిషల్లే నిన్ను కొండ కోనల కొదిలేసాడ
అగ్గిలోన దూకి నువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడూ
నెగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడూ

సువ్వి సువ్వి సువ్వీ
సువ్వి సువ్వి సువ్వీ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ

చుట్టూ వున్న చెట్టు చేమ తోబుట్టువులింక నీకమ్మా
చుట్టూ వున్న చెట్టు చేమ తోబుట్టువులింక నీకమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
పట్టిన గ్రహణం విడిచి
నీ బ్రతుకున పున్నమి పండే గడియ
వస్తుందమ్మా ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆ నాడు
చూస్తాడా ఆ పైవాడు

సువ్వి సువ్వి సువ్వీ
**************************************


ఫిల్మ్!! శంకరాభరణం !!
సంగీతం::కేవి.మహాదేవన్
రచన::వేటూరి
గానం::బాలు

దొరకునా...దొరకునా ఇటువంటి సేవ
నీ పదరాజీవముల చేరు నిర్వాణసోపాన
మధిరోహణము చేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ !!

రాగాలనంతాలు నీ వేయిరూపాలు
భవరోగతిమిరాల పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై నాలోన చెలగి
నీ ప్రాణదీపమై నాలోన వెలిగే ఆ...ఆ...
నిను కొల్చువేళ దేవాదిదేవా
దొరకునా ఇటువంటి సేవ!!

ఉచ్చ్వాసనిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై
వెలుగొందువేళ మహానుభావా
దొరకునా ఇటువంటి సేవ!!

అద్వైత సిద్దికి అమరత్వ లబ్దికి గానమే సోపానము 2
సత్వ సాధనకు సత్య సోధనకు
సంగీతమే ప్రాణము 2
త్యాగరాజ హృదయమై
రాగరాజ నిలయమై
ఓం ఓం ఓంకారనాదాను సంధానమౌగానమే
శంకరాభరణము..శంకరాభరణము

No comments: