Monday, December 05, 2011

డాక్టర్ చక్రవర్తి--1964::జంఝూటి::రాగం















జంఝూటి రాగం లో సుశీలమ్మ గారు పాడిన ఈ ఆణిముత్యం మీకోసం

సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::P.సుశీల

రాగం::జంఝూటి

పల్లవి::

పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా
నేనే పరవశించి పాడనా
పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా

చరణం::1

నీవు పెంచిన హృదయమే..ఇది నీవు నేర్పిన గానమే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ.......
నీవు పెంచిన హృదయమే..ఇది నీవు నేర్పిన గానమే
నీకు కాక యెవరి కొరకు..నీవు వింటె చాలు నాకు

పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా

చరణం::2

చిన్న నాటి ఆశలే..ఈ నాడు పూసెను పూవులై
చిన్న నాటి ఆశలే..ఈ నాడు పూసెను పూవులై
ఆ పూవులన్ని..మాటలై వినుపించు నీకు పాటలై

పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా
నేనే...పరవశించి పాడనా..
చరణం::3

ఈ వీణ మ్రోగక ఆగినా..నే పాడ జాలక పోయినా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ......
ఈ వీణ మ్రోగక ఆగినా..నే పాడ జాలక పోయినా
నీ మనసులో ఈనాడు నిండిన..రాగ మటులే వుండని
అనురాగ మటులే వుండనీ..

పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా
నేనే......

No comments: