Monday, December 05, 2011

పొట్టేలు పున్నమ్మ--1978



సంగీతం::K.V.మహదేవన్ 
రచన::ఆచార్యా-ఆత్రేయ
గానం::P.సుశీల
Film Directed By::R.TyaagaRaajan
తారాగణం::మురళీమోహన్,శ్రీప్రియ,మోహన్‌బాబు,జయమలిని,నాగేష్,అల్లురామలింగయ్య,పద్మప్రియ,ప్రభకర్ రెడ్డి,రావుగోపాల్‌రావు,ముక్కామల,రాజనాల.

పల్లవి:: 

ఓ..హో..హో..ఓ..ఓ..ఓ..ఓ..హోయ్
ఆ..హా..హా.ఆ ఆ ఆ ఆ ఓఓ..ఆ..ఓఓ
లలలలా..లలలలా..లలలలా..ఆఆ..లలలలా

గలగల జలజలా జలజలా జలజలా గలగల
పారే చిట్టేరూ..ఊ..నేను నువ్వు ఒకటే తీరు
నిలకడ లేక...అలసట లేక
నీడ...వెతుకుతున్నాను 
తోడు...వెతుకుతున్నాను

గలగల జలజలా జలజలా జలజలా గలగల
పారే చిట్టేరూ నేను నువ్వు ఒకటే తీరు

చరణం::1

కొండలైన కోనలైన..నిన్ను ఆపలేవు
కోటి వరాలిచ్చినా..నన్ను పొందలేరు
కొండలైన కోనలైన..నిన్ను ఆపలేవు
కోటి వరాలిచ్చినా..నన్ను పొందలేరు
నీవెక్కడింకి పోతావో..నేనెక్కడిమిడి పోతానో
ఎవరికి తెలుసు నీకు నాకు ఉన్నదో చల్లనీ మనసు

గలగల జలజలా జలజలా జలజలా గలగల
పారే చిట్టేరూ నేను నువ్వు ఒకటే తీరు

చరణం::2 

సాగరమున్నదని నువ్వు సాగి పోయేవు
ఏ గట్టు లేక నేను కట్టుబడి ఉన్నాను
సాగరమున్నదని నువ్వు సాగి పోయేవు
ఏ గట్టు లేక నేను కట్టుబడి ఉన్నాను

నీ సంబరమెపుడు తీరునో
నా సంబరమెవరి తోడనో
ఎవరికి తెలుసు నీకు నాకు
ఉన్నదో చల్లనీ మనసు

గలగల జలజలా జలజలా జలజలా గలగల
పారే చిట్టేరూ నేను నువ్వు ఒకటే తీరు

చరణం::3

వరద వచ్చి నువ్వు..ఉరకలే వేసేవు
వయసు వచ్చి నేను కలలెన్నో కన్నాను
వరద వచ్చి నువ్వు ఉరకలే వేసేవు
వయసు వచ్చి నేను కలలెన్నో కన్నాను
నీ అలలకంతమెప్పుడో... ఆ కలలకర్ధమేమిటో
ఎవరికి తెలుసు నీకు నాకు ఉన్నదో చల్లనీ మనసు

గలగల జలజలా జలజలా జలజలా గలగల
పారే చిట్టేరూ నేను నువ్వు ఒకటే తీరు

No comments: