సంగీతం::C.R.సుబ్బరామన్
రచన::సముద్రాల సీనియర్
గానం::ఘంటసాల
నిర్మాత::చక్రపాణి
దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
సంస్థ::వినొదా పిక్చర్స్
నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,s.v.రంగారావు.
పల్లవి::
పల్లెకు పోదాం పారులు చూదాం..చలో చలో
పల్లెకు పోదాం పారులు చూదాం..చలో చలో
అల్లరి చేదాం..చలో చలో..ఓ ఓ
పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
అల్లరి చేదాం..చలో చలో
ప్రొద్దువాలే ముందుగానే..ముంగిటవాలేము
ప్రొద్దువాలే ముందుగానే..ముంగిటవాలేము
పల్లెకు పోదాం పారులు చూదాం..చలో చలో
అల్లరి చేదాం..చలో చలో
చరణం::1
ఆట పాటలందు కవ్వించు..కొంటె కోణంగీ ఈ ఈ ఈ ఈ
ఆట పాటలందు కవ్వించు..కొంటె కోణంగి
మనసేమొ మక్కువేమొ..మనసేమొ మక్కువేమొ
నగవేమొ వగేమో..కనులారా చూదము..ఊ..
పల్లెకు పోదాం పారులు చూదాం..చలో చలో
అల్లరి చేదాం..చలో చలో
చరణం::2
నన్ను చూడగానే..చిననాటి చనువు చూపేనో..ఓ ఓ ఓ ఓ
నన్ను చూడగానే..చిననాటి చనువు చూపేనో
నా దరికి దూకునో..నా దరికి దూకునో
తానలిగి పోవునో..ఏమౌనో చూదము
పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
అల్లరి చేదాం..చలో చలో
ప్రొద్దువాలే ముందుగానే..ముంగిటవాలేము..ఉ..
పల్లెకు పోదాం పారులు చూదాం..చలో చలో
అల్లరి చేదాం..చలో చలో చలో చలో
No comments:
Post a Comment