Monday, December 05, 2011
గండికోట రహస్యం--1969
చిమ్మటలోని ఈ ఆణి ముత్యం వింటూ--సాహిత్యాన్ని చూస్తూ పాడుకొందామా
సంగీతం: టి.వి.రాజు
రచన::సినారే
గానం: ఘంటసాల,సుశీల
పల్లవి::
తెలిసింది తెలిసింది అబ్బయిగారూ
తెల్లారిపోయింది మి కోడె పొగరు
నేనే తోడూ రాకుంటే మీ పని అయ్యేది బేజారు
తెలిసేది తెలిసేది అమ్మయిగారూ
నీలాంటి రేవున ఈ పిల్ల పొగరు
నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు
చరణం::1
మాటలు వింటుంటే కోటలు దాటే
టెక్కులు చూస్తుంటే చుక్కలు మీటే
మాటలు వింటుంటే కోటలు దాటే
టెక్కులు చూస్తుంటే చుక్కలు మీటే
పెంకి రంగు పాలపొంగు వట్టి హంగు
ఒడలపొంగు నీ అల్లరి చూపులు
కళ్ళెం వేసి ఆడించకు
తెలిసేది తెలిసేది అమ్మయిగారూ
నీలాంటి రేవున ఈ పిల్ల పొగరు
నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు !!
కనుబొమ్మలాడితే కాలం ఆగే
విసురుగా సాగితే వన్నెలూగే
కనుబొమ్మలాడితే కాలం ఆగే
విసురుగా సాగితే వన్నెలూగే
లేతవయసు వేడి సొగసు కోతిమనసు
లేతవయసు వేడి సొగసు కోతిమనసు
కొంత తెలుసు
కొంత తెలుసు నీ మెత్తని నవ్వుల
గుత్తులు విసిరి వేధించకు
తెలిసింది తెలిసింది అబ్బయిగారూ
తెల్లారిపోయింది మి కోడె పొగరు
నేనే తోడూ రాకుంటే మీ పని అయ్యేది బేజారు
తెలిసేది తెలిసేది అమ్మయిగారూ
నీలాంటి రేవున ఈ పిల్ల పొగరు
నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు
ఆహహ ఆహహహా..ఓ హొ హొహో..ఓహోహోహో
ఆహహ ఆహహహా..ఓ హొ హొహో..ఓహోహోహో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment