Monday, December 05, 2011

దేవదాసు--1953







సంగీతం::C.R.సుబ్బరామన్ 
రచన::సముద్రాల సీనియర్ 
గానం::రావు బాలసరస్వతి 
నిర్మాత::చక్రపాణి
దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
సంస్థ::వినొదా పిక్చర్స్
నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,s.v.రంగారావు.  
(క్షేత్రయ్య పదం), కీర్తన

ఇంత తెలిసి యుండి ఈ గుణమేలరా 
పంతమా మువ్వ గోపాలా నాసామి 
ఇంత తెలిసి యుండి... 

చరణం::1

అలుక జేసి..ఇంటికి రావైతివి  
అలుక జేసి..ఇంటికి రావైతివి  
చెలికత్తెలున్నారా..పిలువవచ్చేరా 
చెలికత్తెలున్నారా..పిలువవచ్చేరా 
చెలికత్తెవైనా నీవే..చెలువుడవైన నీవే 
చెలికత్తెవైనా నీవే..చెలువుడవైన నీవే 
తలచి చూడరా..తానే దైవము నీవే

ఇంత తెలిసి యుండి ఈ గుణమేలరా 

వింతదానివలె నన్ను..వేరుచేసిరావైతివి
అంతరంగులున్నారా..నన్నాదరించేరా 
వింతదానివలె నన్ను..వేరుచేసిరావైతివి
అంతరంగులున్నారా..నన్నాదరించేరా 
అంతరంగమైన నీవే..ఆదరించేను నీవే 
అంతరంగమైన నీవే..ఆదరించేను నీవే 
చింతించి చూడనా..జీవనము నీవే
చింతించి చూడనా..జీవనము నీవే

ఇంత తెలిసి యుండి ఈ గుణమేలరా 

చరణం::3

శ్రీనిధి మువ్వ..గోపాల నన్నేలరా
శ్రీనిధి మువ్వ..గోపాల నన్నేలరా
నానేకులెవరైనా..ఆనందించేరా
నానేకులెవరైనా..ఆనందించేరా
నానేకులైనా నీవే..నమ్మగనెచ్చినా నీవే 
నానేకులైనా నీవే..నమ్మగనెచ్చినా నీవే  
ఆనగ పలికెద..నా ఆనందమైనా నీవే  

ఇంత తెలిసి యుండి ఈ గుణమేలరా 
పంతమా మువ్వ గోపాలా నాసామి 
ఇంత తెలిసి యుండి... 

No comments: