చిమ్మటలోని..ఈ పాట సాహిత్యం..ఇక్కడ చూడొచ్చు..వినవచ్చు
సంగీతం::మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
నటీ,నటులు::శోభన్,విజయశాంతి,
రాధిక,అన్నపూర్ణ,సోమయాజులు.
విజయశాంతి ::
ఆకేసి పప్పేసి..బువ్వేసి నెయ్యేసి
తనకో ముద్ద..నాకో ముద్ద
ఆకేసి పప్పేసి..బువ్వేసి నెయ్యేసి
తనకో ముద్ద..నాకో ముద్ద
తినిపించువాడొచ్చే..వేళయింది
వళ్ళంతా కళ్ళుగా..ఎదురొచ్చింది
ఇలా ఇలా ఇలా..ఆ..ఇలా ఇలా ఇలా
విజయశాంతి::
అతగడే జతగాడు..అనుకున్నది
అనుకున్నదే కలలు..కంటున్నది
అతగాడే జతగాడు..అనుకున్నది
అనుకున్నదే కలలు..కంటున్నది
కలలోని విందు..కనులవిందవునా
కలలోని విందు..కనులవిందవునా
మనసులోని ఆశ..మాంగళ్యమవునా
ఇలా ఇలా ఇలా..ఆ..ఇలా ఇలా ఇలా
శోభన్::
ఇది కలా కలా కలా
మనమిలా ఇలా ఇలా
విజయశాంతి::
గాలిలా పువ్వులా తావిలా
కలిసి ఉన్నాము కలవకనే
కలుసుకున్నాము తెలియకనే
శోభన్::
వెలుగుకు నీడకు చెలిమిలా
ఒక్కటైనాము కలవకనే
ఒదిగిఉన్నాము కరగకనే
విజయశాంతి::
ఈ ప్రేమపత్రము..ఈ జన్మకు చెల్లువేయ్యుము
శోభన్::
ప్రతి జన్మజన్మకు..మరల తిరగ వ్రాసుకుందము
విజయశాంతి::
ఎలా ఎలా ఎలా..ఆ ఆ ఆ
శోభన్::
ఇలా ఇలా ఇలా..ఇలా ఇలా ఇలా
శోభన్::
ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది..ఆశ ఉంది
విజయశాంతి::
వెన్నెల కలువలా..చెలువలా
మందగించాము..జతలుగ
విందులవుదాము..కధలుగా
శోభన్::
కన్నుల పాపలా..చూపులా
చూచుకుందాము..సొగసులుగా
పగలు రేయిగా..రేయి పగలుగా
విజయశాంతి::
ఈ రాగసూత్రము..మూడుముళ్ళు వేసుకుందము
శోభన్::
ఈ మూగమంత్రము..దీవెనగా చేసుకుందము
విజయశాంతి::
ఎలా ఎలా ఎలా..ఆ ఆ ఆ
శోభన్::
ఇలా ఇలా ఇలా..ఇలా ఇలా ఇలా
విజయశాంతి::
ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది
శోభన్::
ఆకలి ఉంది..ఆశ ఉంది
ఇద్దరు::
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
No comments:
Post a Comment