Monday, August 08, 2011

పెళ్ళినాటి ప్రమాణాలు--1958




సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల, జిక్కి 
తారాగణం::అక్కినేని, జమున, S,V,. రంగారావు, రాజసులోచన,రమణారెడ్డి 

పల్లవి::

బృందావన చందమామ ఎందుకోయి తగవు
బృందావన చందమామ ఎందుకోయి తగవు
అందమెల్ల నీదే ఆనందమె కద నాది
బృందావన చందమామ ఎందుకోయి తగవు

చరణం::1

మంద మందహాసములే వెన్నెలలై విరియ
రచట రంగ రంగములను రాసలీల వెలయ
మంద మందహాసములే వెన్నెలలై విరియ
రచట రంగ రంగములను రాసలీల వెలయ
యదు సుందర నీ రూపము కనువిందుగదోయి

బృందావన చందమామ ఎందుకోయి తగవు

చరణం::2

చిరు గజ్జల గలగలలు కలరవములు చెలగ
మురళీరవ మధురిమలు రాగసుఖము కలుగ
చిరు గజ్జల గలగలలు కలరవములు చెలగ
మురళీరవ మధురిమలు రాగసుఖము కలుగ
మనమోహనమీ గానము మధురమధురమోయి

బృందావన చందమామ ఎందుకోయి తగవు
బృందావన చందమామ ఎందుకోయి తగవు
అందమెల్ల నీదే ఆనందమె కద నాది

No comments: