Showing posts with label Music Director::B.Narasihma Rao. Show all posts
Showing posts with label Music Director::B.Narasihma Rao. Show all posts

Friday, August 17, 2012

అర్థాంగి--1955




సంగీతం::B.నరసింహారావు-అశ్వత్థామ
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::జిక్కి

Film Directed By::P.Pullayya
తారాగణం::అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, గుమ్మడి, శాంతకుమారి

పల్లవి::

ఎక్కడమ్మా చంద్రుడు
ఎక్కడమ్మా చంద్రుడు
చక్కనైన చంద్రుడు
ఎక్కడమ్మా చంద్రుడు
చుక్కలారా అక్కలారా
నిక్కి నిక్కి చూతురేలా
ఎక్కడమ్మా చంద్రుడు

చరణం::1

చక్కనైనచంద్రుడు ఎక్కడమ్మా కానరాడు
చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా కానరాడు
మబ్బువెనక దాగినాడో మబ్బువెనక దాగినాడో
మనసు లేక ఆగినాడో..ఎక్కడమ్మా చంద్రుడు

చరణం::2

పెరుగునాడు తరుగునాడు ప్రేమమారని సామి నేడు
పెరుగునాడు తరుగునాడు ప్రేమమారని సామి నేడు
పదముపాడి బ్రతిమిలాడి పలుకరించిన పలుకడేమి
పదముపాడి బ్రతిమిలాడి పలుకరించిన పలుకడేమి
చక్కనైన చంద్రుడు..ఎక్కడమ్మా కానరాడు
ఏలనో కానరాడు..ఎక్కడమ్మా చంద్రుడు
చక్కనైన చంద్రుడు..ఎక్కడమ్మా చంద్రుడు

అర్ధాంగి--1955::కాపీ::రాగం



సంగీతం::బి.నరసింహారావు-అశ్వత్థామ
రచన::ఆత్రేయ-ఆచార్య
గానం::జిక్కి
Film Directed By::P.Pullayya

తారాగణం::అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, గుమ్మడి, శాంతకుమారి

కాపీ :: రాగం

పల్లవి::

వద్దురా కన్నయ్యా..వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇలు వదిలి..పోవద్దురా అయ్యా..
వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇలు వదిలి..
పోవద్దురా అయ్యా..అయ్యా ..
వద్దురా కన్నయ్యా


చరణం::1

పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ
పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ
పసిపాపలను బూచి పట్టుకెళ్లే వేళ
పసిపాపలను బూచి పట్టుకెళ్లే వేళ

వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇలు వదిలి..
పోవద్దురా అయ్యా..అయ్యా ..
వద్దురా కన్నయ్యా

చరణం::2
పట్టు పీతాంబరము మట్టిపడి మాసేనూ
పట్టు పీతాంబరము మట్టిపడి మాసేనూ
పాలుగారే మోము గాలికే వాడేను
పాలుగారే మోము గాలికే వాడేను
వద్దురా..వద్దురా కన్నయ్యా...

చరణం::3

గొల్లపిల్లలు చాల అల్లరివారురా
గొల్లపిల్లలు చాల అల్లరివారురా
గోలచేసి నీపై కొండెములు చెప్పేరు
ఆడుకోవలెనన్న పాడుకోవలెనన్న
ఆడుకోవలెనన్న పాడుకోవలెనన్న
ఆడటను నేనున్న..
ఆడటను నేనున్న
అన్నిటను నీదాన..వద్దురా..వద్దురా..
వద్దురా..వద్దురా..కన్నయ్యా..కన్నయ్యా