Showing posts with label మాంగల్య బలం--1959. Show all posts
Showing posts with label మాంగల్య బలం--1959. Show all posts

Tuesday, June 02, 2015

మాంగల్య బలం--1958




సంగీతం::మాస్టర్ వేణు
రచన::కోసరాజు
గానం::మాధవపెద్ది,జిక్కి
Film Directed By::A.Subba Rao
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,సావిత్రి,రేలంగి,కన్నాంబ,రమణా రెడ్డి,సుకుమారి,రాజసులోచన,S.V.రంగారావు,సూర్యకాంతం,రమణమూర్తి,

పల్లవి::

చెక్కిలి మీద చెయ్యివేసి..చిన్నదానా 
నీవు చింతబోదువెందుకే..ఇంతలోన 
నీ చిక్కులన్ని తీరిపోయె..చిటికెలోన

చేసిన మేలు మరువలేను..చిన్నవాడా 
నీకు చేతులెత్తి మొక్కుతాను..వన్నెకాడా
నా జీవితమే మారిపోయే..నేటితోడా 

చరణం::1

ఆడదాని బ్రతుకంటే..తీగవంటిది 
బాగ నీరు పోసి పెంచకుంటె..సాగనంటదీ 
ఆడదాని బ్రతుకంటే..తీగవంటిది  
మగతోడు ఉంటేనే..జోరుగుంటదీ 
అది మూడు పూలు..ఆరుకాయలవుతుంటది 

చెక్కిలి మీద చెయ్యివేసి..చిన్నదానా 
నీవు చింతబోదువెందుకే..ఇంతలోన 
నీ చిక్కులన్ని తీరిపోయె..చిటికెలోన

చదువు సంధ్యాలేని..చవటను గానోయ్ 
నీ చాతుర్యమంతా నేను..కనిబెడితినోయ్ 
చదువు సంధ్యాలేని..చవటను గానోయ్
మగవారి నాటకాలు..విని యుంటినోయ్ 
వారి మోజులెంత బూటకాలొ..తెలుసుకొంటినోయ్ 

చేసిన మేలు మరువలేను..చిన్నవాడా 
నీకు చేతులెత్తి మొక్కుతాను..వన్నెకాడా
నా జీవితమే మారిపోయే..నేటితోడా

చరణం::2

ఒంటిగానే బ్రతుకంతా..నడుపుకొందువా 
అబ్బా జంట జోలి లేకుండా..జరుపుకొందువా 
ఒంటిగానే బ్రతుకంతా..నడుపుకొందువా 
లోకులంటే కాకులనీ..మర్చిపోదువా 
ఈ లోకమంటె లెక్కలేక..ఎగిరిపోదువా

చెక్కిలి మీద చెయ్యివేసి..చిన్నదానా 
నీవు చింతబోదువెందుకే..ఇంతలోన 
నీ చిక్కులన్ని తీరిపోయె..చిటికెలోన

ఊకదంపు నీతులన్నీ..ఆలకిస్తినోయ్ 
నీ ఊహలోని కిటుకంతా..విప్పి చూస్తినోయ్ 
ఊకదంపు నీతులన్నీ..ఆలకిస్తినోయ్
సూటి పోటి మాటలన్నీ..కట్టిపెట్టవోయ్ 
ఇంక చాటుమాటు చూపులన్నీ..దాచిపెట్టవోయ్ 

చేసిన మేలు మరువలేను..చిన్నవాడా 
నీకు చేతులెత్తి మొక్కుతాను..వన్నెకాడా
నా జీవితమే మారిపోయే..నేటితోడా

Maangalya Balam--1959
Music::Mastar Venu
Lyrics::kOsaraaju
Singer's::Madhavapeddi Satyam,Jikki
Film Directed By::A.Subba Rao
Cast::Akkineni Nageswara Rao,Savitri,Relangi,Kannamba,Ramanareddi,Sukumari,Rajasulochana,S.V.RangaRao,Sooryakantam,Ramanamoorti.

::::::::::::::::::::

chekkili meeda cheyyivEsi..chinnadaanaa 
neevu chintabOduvendukE..intalOna 
nee chikkulanni teeripOye..chiTikelOna

chEsina mElu maruvalEnu..chinnavaaDaa 
neeku chEtuletti mokkutaanu..vannekaaDaa
naa jeevitame maaripOye..nETitODaa 

::::1

aaDadaani bratukanTE..teegavanTidi 
baaga neeru pOsi penchakunTe..saagananTadii 
aaDadaani bratukanTE..teegavanTidi  
magatODu unTene..jOrugunTadii 
adi mooDu poolu..aarukaayalavutunTadi 

chekkili meeda cheyyivEsi..chinnadaanaa 
neevu chintabOduvendukE..intalOna 
nee chikkulanni teeripOye..chiTikelOna

chaduvu sandhyaalEni..chavaTanu gaanOy 
nee chaaturyamantaa nEnu..kanibeDitinOy 
chaduvu sandhyaalEni..chavaTanu gaanOy
magavaari naaTakaalu..vini yunTinOy
vaari mOjulenta booTakaalo..telusukonTinOy 

chEsina mElu maruvalEnu..chinnavaaDaa 
neeku chEtuletti mokkutaanu..vannekaaDaa
naa jeevitame maaripOye..nETitODaa 

::::2

onTigaanE bratukantaa..naDupukonduvaa 
abbaa janTa jOli lEkunDaa..jarupukonduvaa 
onTigaanE bratukantaa..naDupukonduvaa 
lOkulanTE kaakulanii..marchipOduvaa 
ii lOkamanTe lekkalEka..egiripOduvaa

chekkili meeda cheyyivEsi..chinnadaanaa 
neevu chintabOduvendukE..intalOna 
nee chikkulanni teeripOye..chiTikelOna

Ukadampu neetulannii..aalakistinOy 
nee UhalOni kiTukantaa..vippi choostinOy 
Ukadampu neetulannii..aalakistinOy
sooTi pOTi maaTalannii..kaTTipeTTavOy 
inka chaaTumaaTu choopulannii..daachipeTTavOy 

chEsina mElu maruvalEnu..chinnavaaDaa 
neeku chEtuletti mokkutaanu..vannekaaDaa
naa jeevitame maaripOye..nETitODaa

Tuesday, August 02, 2011

మాంగల్య బలం--1959




సంగీతం::మాస్టర్ వేణు
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల, P.సుశీల
Film Directed By::Adoorti SubbaaRao
తారాగణం::అక్కినేని,సావిత్రి,ఎస్.వి.రంగారావు,రేలంగి,కన్నాంబ,రాజసులోచన,
సూర్యకాంతం,రమణమూర్తి

పల్లవి::

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఆకాశవీధిలో..అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే..సయ్యాటలాడెనే

ఆకాశవీధిలో..అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే..సయ్యాటలాడెనే

ఆకాశవీధిలో..అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే..సయ్యాటలాడెనే

చరణం::1

జలతారు మేలిమబ్బు పరదాలు నేసి..తెరచాటు చేసి
పలుమారు దాగి దాగి పంతాలుపోయి..పందాలు వేసి
అందాల చందమామ దొంగాటలాడెనే..దోబూచులాడెనే

ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే
ఆఆఆఆ..ఓఓఓఓఓఓ..ఆఆఆఆ..ఓఓఓఓఓఓ

చరణం::2

జడివాన హోరు గాలి సుడి రేగి రానీ..జడిపించబోనీ
కలకాలం నీవే నేననీ పలు బాసలాడి..చెలి చెంత చేరి
అందాల చందమామ అనురాగం చాటెనే..నయగారం చేసెనే

ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే
ఆఆఆఆ..ఓఓఓఓఓఓ..ఆఆఆఆ..ఓఓఓఓఓఓ

Saturday, July 30, 2011

మాంగల్య బలం--1959::కాఫీ::రాగం















సంగీతం::మాస్టర్ వేణు
రచన::శ్రీశ్రీ
గానం::P.సుశీల,సరోజిని
Film Directed By::Adoorti SubbaaRao
తారాగణం::అక్కినేని,సావిత్రి,S.V.రంగారావు,రేలంగి,కన్నాంబ,రాజసులోచన,

సూర్యకాంతం,రమణమూర్తి

కాఫీ::రాగం 

పల్లవి::

హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా..చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి

చరణం::1

సతి ధర్మం పతి సేవేయని..పతి భక్తిని చూపాలి
అనుదినము అత్త మామల..పరిచర్యలనే చేయాలి
పతి ఇంట్లో బంధు జనాల..అభిమానం పొందాలి
పతి ఇంట్లో బంధు జనాల..అభిమానం పొందాలి
పదిమంది నీ సుగుణాలే..పలుమార్లు పొగడాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి

చరణం::2

ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి
సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి
శరీరాలు వేరే కానీ..మనసొకటై మసలాలి
శరీరాలు వేరే కానీ..మనసొకటై మసలాలి
సుఖమైనా అసత్యమైనా..సగపాలుగా మెలగాలి

హాయిగా..చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి

చరణం::3

ఇరుగమ్మలు పొరుగమ్మలతో..ఇంటి సంగతులు అనవద్దు
చీరలు నగలిమ్మని భర్తను..చీటికి మాటికి అడగద్దు
అత్తింటను అదిరిపాటుతో..పుట్టింటిని పొగడద్దు
అత్తింటను అదిరిపాటుతో..పుట్టింటిని పొగడద్దు
తరుణం దొరికిందే చాలని..తలగడ మంత్రం చదవద్దు

హాయిగా..చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి

Monday, August 02, 2010

మాంగల్య బలం--1959




సంగీతం::మాస్టర్ వేణు
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల, P.సుశీల
Film Directed By::Adoorti SubbaaRao
తారాగణం::అక్కినేని,సావిత్రి,ఎస్.వి.రంగారావు,రేలంగి,కన్నాంబ,రాజసులోచన,

సూర్యకాంతం,రమణమూర్తి

పల్లవి::

పెనుచీకటాయె లోకం..చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

చరణం::1

చిననాటి పరిణయ గాథ..ఎదిరించలేనైతినే
చిననాటి పరిణయ గాథ..ఎదిరించలేనైతినే
ఈనాటి ప్రేమగాథ..తలదాల్చలేనైతినే

కలలే నశించిపోయే..మనసే కృశించిపోయే
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

పెనుచీకటాయె లోకం..చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

చరణం::2

మొగమైన చూపలేదే..మనసింతలో మారెనా
మొగమైన చూపలేదే..మనసింతలో మారెనా
నా ప్రాణ సతివని తెలిపే..అవకాశమే పోయెనా

తొలినాటి కలతల వలన..హృదయాలు బలి కావలెనా
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

పెనుచీకటాయె లోకం..చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

మాంగల్య బలం--1959




సంగీతం::మాస్టర్ వేణు
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల, P.సుశీల
Film Directed By::Adoorti SubbaaRao
తారాగణం::అక్కినేని,సావిత్రి,ఎస్.వి.రంగారావు,రేలంగి,కన్నాంబ,రాజసులోచన,

సూర్యకాంతం,రమణమూర్తి

పల్లవి::

వాడిన పూలే వికసించెనే
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ
వాడిన పూలే వికసించెనే

తీయని కలలే ఫలియించెనే
తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ
తీయని కలలే ఫలియించెనే

చరణం::1

వేయిరేకులు విరిసింది జలజం
తీయ తేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక వుద్యానవనము
లోటు లేదిక మనదే సుఖము 

తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ
తీయని కలలే ఫలియించెనే

చరణం::2

పగలే జాబిలి ఉదయించెనేలా
వగలే చాలును పరిహాసమేలా
పగలే జాబిలి ఉదయించెనేలా
వగలే చాలును పరిహాసమేలా
తేట నీటను నీ నవ్వు మొగమే
తేలియాడెను నెలరేని వలెనే

వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ
వాడిన పూలే వికసించెనే

చరణం::3

జీవితాలకు నేడే వసంతం
చేదిరిపోవని ప్రేమానుబంధం
ఆలపించిన ఆనంద గీతం
ఆలకించగ మధురం మధురం 

వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ
వాడిన పూలే వికసించెనే

Friday, July 30, 2010

మాంగల్య బలం--1958::తిలక్‌కామోద్::రాగం



సంగీతం::మాస్టర్ వేణు
రచన::శ్రీశ్రీ
గానం::P.సుశీల
Film Directed By::Adoorti SubbaaRao
తారాగణం::అక్కినేని,సావిత్రి,S.V.రంగారావు,రేలంగి,కన్నాంబ,రాజసులోచన,

సూర్యకాంతం,రమణమూర్తి
తిలక్‌కామోద్::రాగం 

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడే నా హృదయం

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం::1

కలకలలాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము
కలకలలాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము
తీయని ఊహల ఊయల లూగి
తేలే మానసము..ఏమో
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం::2

రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు..ఊ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు
పరిచయమైన కోయిల పాటే
కురిసే అనురాగం..ఏమో
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం::3

అరుణ కిరణముల గిలిగింతలలో
తరగిన తెలిమంచు తెరలే తరలి
అరుణ కిరణముల గిలిగింతలలో
తరగిన తెలిమంచు తెరలే తరలి
ఎరుగని వింతలు ఎదుటే నిలిచి
వెలుగే వికసించే..ఏమో
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం