సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::జిక్కి, S. వరలక్ష్మి
Film Directed By::Adoorti Subba Rao
తారాగణం::బాలయ్య,జమున, S.వరలక్ష్మి,పద్మనాభం,గిరిజ,రేలంగి
పల్లవి::
నవనీతచోరుడు నందకిశోరుడు
అవతారపురుషుడు దేవుడే చెలి
అవతారపురుషుడు దేవుడే
తెలియని మూఢులు కొలిచిననాడు
ఎటువంటివాడు భగవానుడే
ఎటువంటివాడు భగవానుడే
చరణం::1
పసివయసునందే పరిపరివిధముల
ప్రజ్ఞలు చూపిన..మహనీయుడే
ప్రజ్ఞలు చూపిన..మహనీయుడే
హద్దుపద్దులేని ముద్దుల పాపడి
అల్లరికూడా..ఘనకార్యమేనా
అల్లరికూడా..ఘనకార్యమేనా
ఆ..నవనీతచోరుడు నందకిశోరుడు
అవతారపురుషుడు దేవుడే చెలి
అవతారపురుషుడు..దేవుడే
చరణం::2
కోనేట యువతులు స్నానాలు చేయ
కోనేట యువతులు స్నానాలుచేయ
కోకల దొంగ...మొనగాడటే
అహ కోకలదొంగ..మొనగాడటే
పడతులకపుడు పరమార్ధపథము
భక్తిని నేర్పిన..పరమాత్ముడే
భక్తిని నేర్పిన..పరమాత్ముడే
నవనీతచోరుడు నందకిశోరుడు
అవతారపురుషుడు దేవుడే చెలి
అవతారపురుషుడు దేవుడే
చరణం::3
పదునాలుగు జగములు పాలించువాడే..ఏ
పదునాలుగు జగములు పాలించువాడే
ప్రత్యక్ష దైవము..శ్రీకృష్ణుడే
ప్రత్యక్ష దైవము..శ్రీకృష్ణుడే
ఎదురేమిలేని..పదవి లభిస్తే
ఎటువంటివాడు..భగవానుడే
ఎటువంటివాడు..భగవానుడే
No comments:
Post a Comment