Sunday, March 23, 2014

నా ఇల్లు--1953::సారంగ::రాగం























సంగీతం::చిత్తూరు నాగయ్య, అద్దెపల్లి
రచన::దేవులపల్లి
గానం::R.బాలసరస్వతీ దేవి, జిక్కి

(M.L.వసంతకుమారి, T. A. మోతి)
(M.L.వసంతకుమారి, T. A. మోతి )

సారంగ::రాగం
తారాగణం::నాగయ్య, B.జయమ్మ,రాజకుమారి,లింగమూర్తి,వేదవతి,గిరిజ

పల్లవి::

అదిగదిగో గగనసీమ..అందమైన చందమామ ఆడెనోయి
అదిగదిగో గగనసీమ..అందమైన చందమామ ఆడెనోయి
ఇదిగిదిగో తేలి తేలి..చల్లనైన పిల్లగాలి
ఇదిగిదిగో తేలి తేలి..చల్లనైన పిల్లగాలి పాడెనోయి
సారిగమ పదనిసా..సాదాపమ రిగమరిస 
అదిగదిగో గగనసీమ..అందమైన చందమామ ఆడెనోయి

చరణం::1

హాయి హాయి ఈ లోకం..తీయనైనదీ లోకం
హాయి హాయి ఈ లోకం..తీయనైనదీ లోకం
నీ ఇల్లే పూల వనం..నీ సర్వం ప్రేమ ధనం
మరువకోయి..ఈ సత్యం..అదిగదిగో గగనసీమ..

చరణం::2

నీ కోసమే జగమంతా..నిండెనోయి వెన్నెలలు
నీ కోసమే జగమంతా..నిండెనోయి వెన్నెలలు
తేలెనోయి గాలి పైన..తీయనైన కోరికలు

చరణం::3

ఆ ఆ ఆ ఆ ఆ..
చెరుపుకోకు నీ సౌఖ్యం..చేతులార ఆనందం
చెరుపుకోకు నీ సౌఖ్యం..చేతులార ఆనందం
యేనాడును పొరపడకోయ్..యేమైన తొరపడకోయ్
మరల రాదు రమ్మన్నా..మరల రాదు రమ్మన్నా
మాయమైన ప్రేమధనం..చివురింపదు తిరిగీ
వాడి చెడిన పూలవనం..మరువకోయి ఈ సత్యం..మ్మ్ మ్మ్ మ్మ్

No comments: