Friday, March 27, 2015

సంబరాల రాంబాబు--1970::ఖమాస్::రాగం


సంగీతం::V.కుమార్ 
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::చలం,శారద,S.V. రంగారావు,గీతాంజలి,రేలంగి,సూర్యకాంతం,పద్మనాభం    
ఖమాస్::రాగం  పల్లవి::

మామా..ఆ..చందమామా..ఆ..వినరావా నా కథ

మామా చందమామా..వినరావా నా కథ
వింటే మనసు ఉంటే..కలిసేవూ నా జత..ఆఆఆ 
మామా..చందమామా..ఆ 

చరణం::1

నీ రూపము ఒక దీపము..గతిలేని పేదకు 
నీ రూపము ఒక దీపము..గతిలేని పేదకు 

నీ కళలే సాటిలేని..పాఠాలు ప్రేమకు
నువు లేక నువు రాక..విడలేవు కలువలు 
జాబిల్లి నీ హాయి..పాపలకు జోలలు 

మామా చందమామా..వినరావా నా కథ
వింటే మనసు ఉంటే..కలిసేవూ నా జత..ఆఆఆ 
మామా..చందమామా..ఆ

చరణం::2

మింటిపైన నీవు ఓంటిగాడివై..అందరికీ వెన్నెల పంచ
రేయంత తిరగాలి
ఇంటిలోన నేను ఒంటిగాడినై..అందరికీ సేవలు చేయ
రేయి పవలు తిరగాలి

లేరు మనకు బంధువులు..లేరు తల్లిదండ్రులు
లేరు మనకు బంధువులు..లేరు తల్లిదండ్రులు
మనను చూసి అయ్యోపాపం..అనేవారు ఎవ్వరు
అనేవారు...ఎవ్వరు

మామా చందమామా..వినరావా నా కథ
వింటే మనసు ఉంటే..కలిసేవూ నా జత..ఆఆఆ 
మామా..చందమామా..ఆ

2 comments:

smartkram said...

సంబరాల రాంబాబు చిత్రంలోని అన్నీ వీడియో పాటలను ఇక్కడ వీక్షించండి.

https://www.youtube.com/playlist?list=PLMWZNMZrl8xeu_Bapskvap1Se6O9VgvUf

మీ కృషికి ధన్యవాదాలు, మీ website కి subscribe చేసుకుని చాల సంతోష పడుతున్నాను.

smartkram said...

సంబరాల రాంబాబు చిత్రం యొక్క వీడియో పాటలకు *సరియైన* లింకు క్రింద వున్నది:

https://www.youtube.com/playlist?list=PLMWZNMZrl8xc4boG11fclyK01WMMB7s-5

పొరపాటుకు క్షమించగలరు.